king nagarjuna in hathiram baba regular shooting starts

King nagarjuna in hathiram baba regular shooting starts

hathiram baba, nagarjuna as hathirambaba, raghavendrarao hatirambaba, vimalaraman, nag devotional movie, nagarjuna next movie, nag film starts

king nagarjuna in hathiram baba regular shooting starts in july. this film directing by raghavendrarao. and star casting and crew is finalized.

హథీరామ్ బాబా కి జై..!

Posted: 06/15/2016 01:02 PM IST
King nagarjuna in hathiram baba regular shooting starts

టాలీవుడ్ కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుల కాంబినేషన్‌ అంటేనే ఓ ప్రత్యేకమైన ఆసక్తి. వీరి కలయికలో మాస్‌ కథలు, కుటుంబ చిత్రాలూ తెరకెక్కి ఆకట్టుకున్నాయి. ‘అన్నమయ్య’తో మరో కోణం చూపిస్తూ ప్రేక్షకుల్ని భక్తి సాగరంలో ముంచెత్తారు. ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ ఆధ్యాత్మిక భావాల్ని పంచాయి. మరోసారి వీరిద్దరూ కలసి ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే.

శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్‌ బాబా కథని ఈసారి వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాడు దర్శకేంద్రుడు. ‘సోగ్గాడే చిన్నినాయినా’ తర్వాత నాగ్‌ మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. దాదాపు ఆరు నెలల విరామం అనంతరం ఈ సినిమా కోసం నాగార్జున మళ్లీ మేకప్‌ వేసుకొంటున్నాడు.

వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రానికి క్లాప్‌ కొట్టేస్తారని షూటింగ్ స్టార్ అయిపోతుందని చెప్తున్నారు అందరూ. త్వరలోనే చిత్రం పేరుని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ను కథానాయికలుగా ఇప్పటికే ఎంచుకున్నారు. ఇప్పటికే నాలుగు పాటలు కూడా రికార్డింగ్‌ జరుపుకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా శ్రీకృష్ణ సీరియల్ లో ఫేమస్ అయిన ఆర్టిస్ట్ సురభ్ రాజ్ జైన్ ని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hathiram baba next  hathiram baba story  nagarjuna  k raghavendrarao  

Other Articles