తరుణ్శెట్టి, అవంతిక, కిరీటి కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు కథా సహకారం అందించిన హుస్సైన్ షా కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘పరిణితి లేని ఓ అబ్బాయి, జీవితం పట్ల అవగాహన, బాధ్యత కలిగిన ఓ అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథే ఈ సినిమా. ప్రేమలో పడ్డ తర్వాత వీరిద్దరి మధ్య ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించామని'' చెప్పారు. ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిగారు ఏఎన్నార్‌గారికి ‘మీకుమీరే మాకుమేమే’ పాట నేర్పించే సన్నివేశమంటే నాకు చాలా ఇష్టమని అదే సినిమా ఇన్సిప్రిరేషన్ తో ఈ సినిమాని రూపొందిచామని చెప్పారు.
చక్కని రొమాంటిక్ కామెడీ సినిమా అని, స్ర్కీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. నలుగురు మిత్రులు కలిసి నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్‌గారి సహకారం ఎంతో ఉందని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూసి ఆయనే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మా టీమ్‌కు ఎంతో ఉత్సాహానిచ్చింది. నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్ అని, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చెప్పారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more