తెలుగమ్మాయి ఆనంది.. తెలుగులో అవకాశాలు అంతగా రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే అక్కడ నటనతో పాటు ఈ అమ్మడికి కొన్ని కండీషన్లు కూడా పెడుతున్నారట అక్కడి దర్శకనిర్మాతలు. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో గ్లామర్ డోస్ ఎక్కువయ్యిందని, మరోసారి అలాంటి పాత్రల్లో నటించనంటూ ప్రకటించింది.
కానీ ఈ అమ్మడికి ఈమధ్య ఓ దర్శకనిర్మాత బికినీలో నటించాలంటూ ఒత్తిడి తెచ్చాడట. బికినీలో రెండు మూడు హాట్ సీన్లు వున్నాయని, అందువల్ల బికినీ ధరించాలంటూ ఒత్తిడి చేసారని ఆనంది చెప్పుకొచ్చింది. ఇలా పలు చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. కానీ బికినీ, గ్లామర్ పాత్రలలో నటించమని ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అలాంటి పాత్రలు, డ్రెస్సులు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసానని ఆనంది చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు’(తెలుగులో ‘నాకు ఇంకో పేరుంది’) చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సంధర్భంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆనంది తన చేదు అనుభవాలను సైతం చెప్పుకొచ్చింది. కథ వినే సమయంలోనే తాను గ్లామరస్, బికినీ పాత్రలు చేయనని ముందే దర్శకుడితో చెబుతానని తెలిపింది. మరి ఈ అమ్మడు ఈ ‘ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు’ సినిమాలో ఎలా కనిపించిందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more