నాన్నకు ప్రేమతో తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఎన్టీఆర్, మోహన్ లాల్ లుక్స్ కొత్తగా వున్నాయి. ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ‘అత్తిలి సత్తిబాబు’, ‘దేవరాయ’ చిత్రాల హీరోయిన్ విదిషా నటించబోతున్నట్లుగా తెలిసింది.
ఈ సినిమాపై యంగ్ టైగర్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో కొన్ని యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కొనసాగించనున్నారు. యువరాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జులై చివర్లో విడుదల చేసి, ఆగష్టు నెలలో సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Sandy
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more