విశాల్ ఖాతాలో మరో పురస్కారం | Vishal Receives PFCI Award

Vishal receives pfci award

Vishal gets PFCI Award, Vishal PFCI Award, Varalakshmi gets PFCI Award, Vishal awards, Vishal lovestory, Varalakshmi, Varalakshmi stills

Vishal and Varalakshmi gets PFCI Award: Tamil Actor Vishal has been awarded with People for Cattle in India (PFCI) award for his services.

విశాల్ ఖాతాలో మరో పురస్కారం

Posted: 06/07/2016 09:09 AM IST
Vishal receives pfci award

తమిళ స్టార్ హీరో విశాల్ మరియు హీరోయిన్ వరలక్ష్మీలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి ప్రేమ, పెళ్లి విషయం సౌత్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే చెన్నై బాధితుల సహాయార్థంలో విశాల్ పక్కనే వుండి వరలక్ష్మీ తనవంతు సహాయాన్ని అందించింది. అలా వీరిద్దరూ కూడా పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ కోలీవుడ్ లో మంచి పేరును దక్కించుకుంటున్నారు.

ఇక నటీనటులుగా వీరిద్దరూ వారి వారి సినిమాలతో బిజీగా వున్నారు. ఇక హీరో విశాల్ కేవలం నటుడిగానే కాకుండా ఇటీవలే నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచి, తనవంతుగా ప్రజలకు సహయం చేస్తున్నాడు. అలాంటి విశాల్ మరియు వరలక్ష్మీలకు తాజాగా ఓ పురస్కారం వరించింది.

భారతదేశంలో పశువుల సంరక్షణ కోసం స్థాపించిన కాటిల్ ఇన్ ఇండియా(పిఎఫ్ సీఐ) సంస్థ ప్రతి ఏడాది జంతుసంరక్షణ కోసం కృషిచేసిన కొంతమందికి ఈ పురస్కారాలను అందజేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సంస్థ విశాల్ మరియు వరలక్ష్మీలకు పీఎఫ్‌సీఐ పురస్కారాన్ని అందజేసారు. ఈ అవార్డును తమిళనాడు గవర్నర్ రోశయ్య అందజేసారు. ఈ జంటకు పురస్కారాలు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విశాల్, శ్రీదివ్య కలిసి నటించిన ‘రాయుడు’ సినిమా తెలుగు, తమిళం భాషలలో మంచి విజయం సాధించింది. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘రాయుడు’ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ప్రస్తుతం తమన్నాతో కలిసి విశాల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో జగపతి బాబు నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Varalakshmi  PFCI  

Other Articles