ప్రైవసీ కావాలంటున్న మున్నాభాయ్ | Sanjay Dutt wants privacy

Sanjay dutt wants privacy

Sanjay Dutt wants privacy, Sanjay Dutt rambo stills, Sanjay Dutt upcoming films, Sanjay Dutt movie updates, Sanjay Dutt stills, Sanjay Dutt

Sanjay Dutt wants privacy: Sanjay Dutt requests media to respect the privacy of his family.

ప్రైవసీ కావాలంటున్న మున్నాభాయ్

Posted: 06/01/2016 06:10 PM IST
Sanjay dutt wants privacy

‘సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి’ అన్నట్లుగా... సినిమా వాళ్ల కష్టాలు కూడా తక్కువేమి వుండవు. ఎంతో కష్టపడి, భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తుంటే... సినిమా విడుదలవ్వక ముందే అందులోని సీన్లు, ఫోటోలు లీక్ అవుతూ వుంటాయి. ఎవరో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఒక లీకేజ్ ఫోటో విషయంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సీరియస్ అయ్యాడు.

జైలు నుంచి బయటకొచ్చిన సంజయ్ దత్ ఇక తాను ఎవరికోసం సినిమాలు చేయనని చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీ రీమేక్ కోసం సంజయ్ దత్ తెగ కసరత్తులు చేస్తున్నాడు. హాలీవుడ్ హీరో సిల్వర్ స్టర్ స్టాలోన్ నటించిన ‘రాంబో’ చిత్రాన్ని హిందీలోకి సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సంజయ్ దత్ శిక్షణ తీసుకుంటున్నాడు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, అడ్వంచర్ సీన్లు వుండడం వలన మళ్లీ సంజయ్ దత్ ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా సంజయ్ దత్ ట్రైనింగ్ సమయంలో గ్లౌస్ తో వున్న తన ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ అప్ సెట్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు ప్రైవసీ ఇవ్వాలని, ఇలా ప్రతి విషయంలో వెంటపడకూడదని, ఇలా ఫోటోలు లీక్ చేయడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగి అభిమానులు ఎన్నో ఆశలతో వస్తారంటూ సంజయ్ దత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాలో సంజయ్ దత్ ఎలా కనిపించనున్నాడో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Rambo  Stills  

Other Articles