‘దర్శకుడు’గా వస్తున్న సుకుమార్ కొడుకు | Sukumar upcoming film updates

Sukumar upcoming film updates

Sukumar upcoming film updates, Sukumar film title Darshakudu, Sukumar Darshakudu movie updates, Sukumar movies, Sukumar stills, Sukumar

Sukumar upcoming film updates: Director Sukumar upcoming film title confirmed. The title is Darshakudu.

‘దర్శకుడు’గా వస్తున్న సుకుమార్ కొడుకు

Posted: 06/01/2016 05:42 PM IST
Sukumar upcoming film updates

‘నాన్నకు ప్రేమతో’ తర్వాత దర్శకుడు సుకుమార్ తన కొత్త సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయాబోతున్నట్లుగా ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే అంతకంటే ముందుగా ఓ కొత్త వ్యక్తిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈరోజు తన స్వగ్రామం మట్టపర్రుకు వచ్చిన సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ తన కొత్త సినిమా వివరాల గురించి తెలియజేసారు. త్వరలోనే తన బిటీఆర్ క్రియేషన్స్ పై తన అన్నయ్య తనయుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించాడు. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమాకు ‘దర్శకుడు’ అనే టైటిల్, ‘ఫల్ లవ్ హిజ్ ఫ్యాషన్’ అనేది ట్యాగ్ లైన్ అని ఖరారు చేసారు.

ఇందులో ఈషా హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నారని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక తన దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్లుగా సుకుమార్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sukumar  Darshakudu  Movie News  

Other Articles