ఫస్ట్ లుక్ ఎంట్రీ అదిరిందయ్యో! | NTR Janatha Garage First Look

Ntr janatha garage first look

Janatha Garage First Look, Janatha Garage Posters, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

NTR Janatha Garage First Look: Young Tiger NTR upcoming film Janatha Garage. Koratala shiva director. Mytri Movie Makers Produce this film. Samantha, Nithya menon heroines.

ఫస్ట్ లుక్ ఎంట్రీ అదిరిందయ్యో!

Posted: 05/19/2016 06:09 PM IST
Ntr janatha garage first look

‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

రేపు(మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేసారు. 6గంటలకు ఎన్టీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మొదటి పోస్టర్ ను విడుదల చేయగా... 6గంటల 3నిమిషాలకు దర్శకుడు కొరటాల శివ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రెండవ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్లు మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

ఈ పోస్టర్లలో ఎన్టీఆర్ లుక్స్ సూపర్. మాసివ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మరోసారి హాఫ్ షర్ట్ లో అదరగొడుతున్నాడు. ఈ లుక్స్ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెంచేలా చేసాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, నటి విదిశ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garage  NTR  Samantha  Nithya Menon  

Other Articles