నాగశౌర్య, నిహారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక మనసు’. ‘మల్లెల తీరంలో’ అనే బ్యూటీఫుల్ చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు రామరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘ఒక మనసు’ చిత్రాన్ని మధుర శ్రీధర్, టీవి9 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలు నిన్న విడుదలయ్యాయి.
Also Readl: స్టేజ్ మీద మెలికలు తిరిగిన హీరో
పాటలు చాలా బాగున్నాయి. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను కూడా నిన్న విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా వుంది. పండు వెన్నెల్లో.. సాగర తీరాన.. అలలు తాకుతూ వుంటే మనసుకు ఎంత ప్రశాంతత, హాయిని అందిస్తుందో.. ఈ ‘ఒక మనసు’ ట్రైలర్ ను చూస్తుంటే అలా అనిపిస్తుంది.
నిహారిక, నాగశౌర్యల కెమిస్ట్రీ బాగుంది. నిహారిక చాలా బబ్లీగా, హోమ్లీ లుక్ లో కనిపిస్తోంది. దర్శకుడు వంశీ సినిమాల్లోని హీరోయిన్ల వలే నిహారిక లుక్ చాలా అందంగా వుంది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే బ్యూటీఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. ప్రేమ, కుటుంబం, బాధ్యతలు, బంధుత్వాలు, వాటి విలువలు అనే అంశాలతో చాలా చక్కగా తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తుంది.
పైగా ఈ ట్రైలర్ చివర్లో నిహారిక చెప్పిన ‘నీ మీద ప్రేమా చావదు.. ఇంకొకరి మీద ప్రేమా పుట్టదు సూర్య’ అనే డైలాగ్ దాదాపు అందరికి కనెక్ట్ అయ్యే విధంగా వుంది. ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more