‘చెప్పను బ్రదర్’కు బన్నీ చెప్పిన క్లారిటీ! | Allu Arjun shocks to Pawan Kalyan fans

Allu arjun shocks to pawan kalyan fans

Allu Arjun shocks to Pawan Kalyan fans, Allu Arjun speech in Oka Manasu Audio Launch, Allu Arjun Clarifies on Pawan Kalyan Issue, Allu Arjun Apologies, Allu Arjun latest news, Allu Arjun speech, Allu Arjun comments on pawan kalyan, Allu Arjun, oka manasu audio launch

Allu Arjun shocks to Pawan Kalyan fans: Allu Arjun Clarifies on his Controversial Comments on powerstar pawan kalyan in Oka Manasu Audio Launch.

‘చెప్పను బ్రదర్’కు బన్నీ చెప్పిన క్లారిటీ!

Posted: 05/19/2016 09:50 AM IST
Allu arjun shocks to pawan kalyan fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్లు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు అడిగేసరికి... అల్లు అర్జున్ మాత్రం ‘చెప్పను బాస్’ అని అన్నాడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఓ ఇంటర్వ్యూలో అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ మరోసారి కామెంట్లు చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి లోనయ్యారు.

అయితే ఈ రచ్చ రోజురోజుకి పెరిగిపోతుండటంతో అల్లు అర్జున్ కూడా ఈ విషయానికి ఓ ముగింపు పలకాలని నిర్ణయించుకొని.. ‘ఒక మనసు’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఓ క్లారిటీ ఇచ్చేసాడు. నిహారిక, నాగశౌర్య జంటగా నటించిన ‘ఒక మనసు’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్.. ఈ వివాదానికి ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.... పవర్ స్టార్ గురించి మాట్లాడకపోవడానికి కారణం పనవ్ స్టార్ గారి కొంతమంది అభిమానులు. ఒక గ్రూపులా ఏర్పడి పవర్ స్టార్ అని అరిచి ఇబ్బంది పెడతున్నారు. దాని వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. చాలా ఆర్టిస్టులకు స్టేజ్ పై వచ్చినప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ పవర్ స్టార్ అని అరిచినప్పుడు ఏదో మెకానికల్ గా ఆయన గురించి మాట్లాడి వెళ్లిపోతున్నారంతే. అభిమానులు అరిస్తే తప్పు లేదు కానీ మాట్లాడేవారిని డిస్టబ్ చేసేంతలా ఉండకూడదు. ఒక డైరెక్టర్ వందరోజులు కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఆయనకు సినిమా గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలని ఉంటుంది. ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే సినిమా గురించి కాకుండా పవర్ స్టార్ గురించి అద్భుతంగా మాట్లాడేవారు. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. అది తప్పు బ్రదర్. అలాగే బయటి ఆడియో ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు అక్కడ కూడా పవర్ స్టార్ అని అరుస్తున్నారు. అది ఇంకా పెద్ద తప్పు. ఆ హీరో ఫ్యాన్స్ కు కూడా మనం గౌరవం ఇవ్వాలి. అలా గౌరవం ఇస్తే మన గౌరవం ఇంకా పెరుగుతుంది. ఆ ఫంక్షన్ లో ఓ వ్యక్తి మా హీరో ఫంక్షన్ లో మీ హీరో గోలేంటి అని అన్నాడు. నాకు అబ్బా ..అనిపించింది. నన్నంటే మిమ్మల్ని అన్నట్లే కదా, కాబట్టి బయటి ఫంక్షన్స్ లో అలా బిహేవ్ చేయవద్దు అని అన్నారు.

అలాగే పవర్ స్టార్ గారు కొన్ని వందలసార్లు నేను ఈ స్థానంలో ఇలా నిలబడి ఉన్నానంటే అన్నయ్య చిరంజీవిగారే కారణమని కొన్ని వందలసార్లు అన్నారు. కానీ అటువంటి చిరంజీవిగారే మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ అని అరుస్తుంటారు. చిరంజీవిగారు కూడా ఫ్యాన్స్ గోలను ఎంజాయ్ చేస్తారు. కానీ చిరంజీవిగారిలాంటి వ్యక్తి తరువాత మాట మాట్లాడలేనంత అరవడం చాలా తప్పు. ఈరోజు ఇలా అందరూ అరవడానికి, మాట్లాడటానికి ప్లాట్ ఫాం ఇచ్చిన వ్యక్తి చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు గుచ్చి గుచ్చి అరవడం చాలా పెద్ద తప్పు. ఆయన పబ్లిక్ లో, మీడియా ముందు హార్ట్ చేయడంతో నేను హార్ట్ అయ్యాను. అందుకనే నేను కొంత మంది అభిమానులు ఎంత అరిచినా పవర్ స్టార్ గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకు కారణం మీరే. నేను ఎన్ని వందలసార్లు, ఎన్ని సినిమాలో ఆయనపై ఇష్టాన్ని చెప్పలేదు. నేను ఇవ్వాళ కొత్తగా చెప్పాలా అని ప్రశ్నించారు.

నాకు చిరంజీవిగారి తర్వాత పబ్లిక్ ఫంక్షన్స్ లో సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ గారు. ఆయన గురించి ఇప్పుడు కూడా పొగడగలను. కానీ వెన్న పూసినట్లు మాట్లాడటం నచ్చదు. నేను కాంట్రవర్సీ ఎందుకని అవైడ్ చేశాను కానీ, అవైడ్ చేయడం వల్ల కాంట్రవర్సీ వస్తుందనుకోలేదు. ఈ టైంలో నేను జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. కొంత మంది అభిమానులు తప్పు చేస్తున్నారని తెలియజెప్పడానికి నాపై వేసుకున్న నెగటివ్ ఫోర్స్. చిరంజీవిగారికోసం, మిగతా అందరికోసం చేసిన ప్రయత్నమిది. పబ్లిక్ ఫంక్షన్స్ లో నా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కు చెప్పేది ఒకటే. అల్లరి తగ్గించండి. సోషల్ మీడియాలో మనపై మనం రాసుకున్న వార్తలు చీప్ గా ఉన్నాయి. వీటి వల్ల చిరంజీవిగారికి మాట వస్తుందంటే నేను ఒప్పుకోను. మన ఫ్యాన్సే రచ్చ చేసుకున్నారు. నన్ను అపార్థం చేసుకోరని నమ్ముతున్నాను అని అన్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Allu Arjun  Pawan Kalyan  Oka Manasu  Niharika  

Other Articles