ఆ దేవుళ్లపై బ్యాన్ విధించిన దిల్ రాజు | Dil Raju banned two gods in his films

Dil raju banned two gods in his films

Dil Raju banned two gods in his films, Dil Raju angry on lord rama, Dil Raju angry on krishna, Dil Raju movies, Dil Raju interviews, Dil Raju stills, Dil Raju interviews

Dil Raju banned two gods in his films: Producer Dil Raju angry on gods.. because of his last few films flops.

ఆ దేవుళ్లపై బ్యాన్ విధించిన దిల్ రాజు

Posted: 05/14/2016 05:28 PM IST
Dil raju banned two gods in his films

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో వరుస సక్సెస్ సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగిన విషయం తెలిసిందే. గతకొద్ది కాలంగా వరుస ఫ్లాపులు దిల్ రాజుకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. అయితే దిల్ రాజు తన బ్యానర్లో దేవుడి పేరుతో తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయని.. ఇకపై వారి పేరుతో సినిమాలే తీయనని స్పష్టం చేసాడు. ఇంతకీ ఆ దేవుళ్లు ఎవరంటే.. రాముడు మరియు కృష్ణుడు.

రాముడు పేరుతో ఎన్టీఆర్ హీరోగా ‘రామయ్యా వస్తావయ్యా’ అనే చిత్రం నిర్మించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం కాక, కమర్షియల్ హిట్ కూడా రాలేదు. ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఇటీవలే కృష్ణుడి పేరుతో సునీల్ హీరోగా ‘కృష్ణాష్టమి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గతంలో ‘రామరామ కృష్ణకృష్ణ’ అంటూ ఇద్దరు దేవుళ్ల పేర్లు కలిపి పెట్టిన సినిమా కూడా ఘోర పరాజయం పాలయ్యింది.

ఇలా రాముడు, కృష్ణుడు పేర్లతో వచ్చిన సినిమాలన్నీ కూడా తనకు పరాజయాలను మిగల్చడంతో మరోసారి తన బ్యానర్లో ఆ దేవుళ్ల టైటిల్లతో సినిమాలను తీయనని దిల్ రాజు స్పష్టం చేసాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ‘శతమానం భవతి’ అనే సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Supreme  Saidharam Tej  

Other Articles