రికార్డుల్లో ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ హిట్ | Sarrainodu Record Collections

Sarrainodu record collections

Sarrainodu Record Collections, Sarrainodu collections, Sarrainodu records, Sarrainodu movie updates, Sarrainodu Movie, Allu Arjun movies, Allu Arjun records, Allu Arjun stills

Sarrainodu Record Collections: Director Boyapati Srinu latest blockbuster hit film Sarrainodu creates new records in collections.

రికార్డుల్లో ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ హిట్

Posted: 05/14/2016 04:27 PM IST
Sarrainodu record collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్లు రాబడుతోంది. కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీని దర్శకుడు పర్ఫెక్ట్ స్టైలిష్ యాక్షన్ మాస్ హీరోగా చూపించగలిగాడు. దీంతో అభిమానులు త్వరగా కనెక్ట్ అవ్వగలిగారు.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, కెథరిన్ థ్రెసా అందాలు సినిమాలు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. థమన్ సంగీతం అందించిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా తొలివారం ప్రపంచ వ్యాప్తంగా 45.72 కోట్లు వ‌సూలు చేసి బన్నీ ఖాతాలో మరో రికార్డును క్రియేట్ చేసింది.

ఇలా వరుసగా 40కోట్లు దాటిన తొలి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. అలాగే నైజాంలో ఐదుసార్లు 10కోట్ల మార్క్ అందుకున్న ఏకైక హీరోగా బన్నీ మరో రికార్డ్ క్రియేట్ చేసాడు. తొలిసారిగా స్టైలిష్ మాస్ హీరోగా ‘సరైనోడు’ సినిమాలో కనిపించి, భారీ బ్లాక్ బస్టర్ హిట్టును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘సరైనోడు’ రికార్డ్ ను క్రియేట్ చేసింది. మొత్తానికి ‘సరైనోడు’ వరుస రికార్డులతో, కలెక్షన్లతో మోత మోగిస్తున్నాడు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarrainodu  Collections  Rakul preet singh  

Other Articles