మహేష్ తో తాళి కట్టించుకుంటానన్న అమ్మాయి | Who wants t marry Mahesh babu

Who wants to marry mahesh babu

Mahesh Babu, Brahmostavam, Mahesh babu in Brahmostavam, Brahmostavam Teaser, Brahmostavam Madguram teaser, Madhuram Madhuram, బ్రహ్మోత్సవం, మహేష్ బాబు,. బ్రహ్మోత్సవం టీజర్

A kid wants to marry Prince Mahesh Babu in latest cinema trailer Brahmostavam. Mahesh looks very handsome in this teaser.

మహేష్ తో తాళి కట్టించుకుంటానన్న అమ్మాయి

Posted: 05/02/2016 10:34 AM IST
Who wants to marry mahesh babu

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు అంటే అదో క్రేజ్. ఆయన చేసిన ప్రతి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఆయనకు ఉన్న ఫీమేల్ ఫాలోయింగ్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. పెళ్లి కాని అమ్మాయిల దగ్గరి నుండి పెళ్లైన ఆంటీల వరకు అందరికి ఆయనంటే అంత ఇష్టం మరి. అలాంటి మహేష్ బాబును ఓ చిన్న అమ్మాయి తనను పెళ్లిచేసుకోవాలని అడగటం నిజంగా షాకిచ్చింది. స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రిన్స్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మనసులు దోచుకుంటుంటే ఎవరు మాత్రం ఆయనను సొంతం చేసుకోవాలని అనుకోరు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.?

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు భారీ క్రేజ్ ఉంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాత పివిపి. ఇప్పుడు సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. మధురం మధురం అంటూ సాగే ఈ టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోయాయి. మహేష్ అందానికి ఫ్లాట్ అయిన ఓ చిన్నారి తనను పెళ్లి చేసుకుంటావా ..? అని సైగలు చేస్తున్నట్లు ఇందులో కనిపించింది. ఎంతో ఫ్రెష్ లక్ లో కనిపించిన మహేష్.. సినిమా మొత్తం ఇదే ఫ్రెష్ లూక్స్ తో ఉంటె మహేష్ మరొక బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద విశేషం ఏమీ కాదు అని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles