సూర్య హీరోగా ఎన్నో అంచనాలతో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా '24'కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రానికి ఎలాంటి కత్తెరలు లేకుండా 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించింది. ఇక యూ సర్టిఫికెట్తో తమిళనాడులో ఈ చిత్రానికి వినోదపన్ను మినహాయింపు లభించనుంది. ఈ సినిమా మే 6న దేశమంతటా విడుదల కానుంది. 'ఇష్క్', 'మనం' సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహించారు.
'ఆత్రేయా రన్' పేరిట ఓ ఆండ్రాయిడ్ గేమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం సోషల్ మీడియానూ విపరీతంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా విడుదల కోసం సర్వసన్నాహాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నది. 24 సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూర్య సొంత బ్యానర్లో నిర్మించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more