బన్నీ గొంతెమ్మ కోరికల్నీ తీర్చింది ఎవరో తెలుసా? | Sarrainodu success meet

Sarrainodu success meet

Allu Arjun Sarrainodu fim success meet, Sarrainodu Movie theaters list, Sarrainodu Collections, Sarrainodu Movie promotions, అల్లు అర్జున్, సరైనోడు, రకూల్ ప్రీత్ సింగ్, Sarrainodu in banglore, Sarrainodu Trailers, Sarrainodu Movie Tickets, Sarrainodu Movie Online Bookings, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Sarrainodu Movie USA Theaters list, Sarrainodu Movie Posters, Sarrainodu Movie stills

Sarrainodu success meet: Stylish star allu arjun latest film Sarrainodu released on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

బన్నీ గొంతెమ్మ కోరికల్నీ తీర్చింది ఎవరో తెలుసా?

Posted: 04/26/2016 09:24 AM IST
Sarrainodu success meet

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సరైనోడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని, కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.... స్క్రిప్ట్ న‌చ్చి ఒప్పుకున్నా. ఫ‌స్టాఫ్‌లో కోర్టు సీను, సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీను సినిమాను షిఫ్ట్ గేర్ చేశాయి. బోయ‌పాటిగారు చెప్పిన క‌థ‌ను చాలా బాగా తెర‌పై ట్రాన్స్ లేట్ చేశారు.. ఈ సినిమాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్. అంజ‌లి టాప్ హీరోయిన్‌గా ఉంటూ ఐట‌మ్ సాంగ్ చేసింది. ర‌కుల్ చాలా బాగా న‌టించింది. కేథ‌రిన్ ఆది నుంచీ ఈ సినిమాపై న‌మ్మ‌కం పెట్టుకుంది. ఈ సినిమాతో మాస్‌లోకి వెళ్లాల‌నే నా గోల్ 200 శాతం నెర‌వేరింది. గీతా ఆర్ట్స్ లో నేను ఇంత‌కు ముందు చేసిన హ్యాపీ, భ‌ద్రినాథ్ పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ మంచి హిట్‌ను ఈ సినిమాతో కొట్టాన‌నే తృప్తి ఉంది. నేను కోరిన గొంతెమ్మ కోరిక‌ల‌ను తీర్చిన మా నాన్న నా కెరీర్‌లోమంచి గ్రాస‌ర్‌ని ఇచ్చారు. నాతోనే కాదు చిరంజీవిగారితో పనిచేసిన రోజుల్లోనూ ఆల్‌టైమ్ గ్రాస‌ర్‌లు ఇచ్చేవారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి జ‌ల్సా, చ‌ర‌ణ్‌కి మ‌గ‌ధీర‌, నాగ‌చైత‌న్య‌కు 100ల‌వ్‌, నానికి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఈ సినిమాను ఇచ్చారు. నేను బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని అంద‌రూ అంటారు. నాక‌న్నా ఎక్కువ‌గా బోయ‌పాటి క‌ష్ట‌ప‌డతారు. ఆ విష‌యాన్ని నేను చాలా మందితో చెప్పాను. ఆయ‌న క‌ష్టం కోస‌మైనా సినిమా హిట్ కావాల‌ని అనుకునేవాడిని. మా నాన్న‌కు సినిమా అంటే పేష‌న్ ఎక్కువ‌. నేను, మా త‌మ్ముడు, మా నాన్న క‌లిసి వాట్స‌ప్ గ్రూపులో ఉంటే ఆ గ్రూపుకు మేం విల‌వ్ సినిమా అనే పేరు పెట్టుకున్నాం అని అన్నారు.

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.... ప్ర‌తి సినిమానూ నేను మొద‌టి సినిమాగానే భావిస్తాను. క‌థ విని న‌న్ను న‌మ్మి ఈ సినిమా చేశారు. న‌న్ను న‌మ్మిన డిస్ట్రిబ్యూటర్ల కోసం, ప్రేక్ష‌కుల కోసం హిట్ కొట్టాల‌నే త‌ప‌న‌తోనే ప‌నిచేశాను. ఈ సినిమాకు న‌టీన‌టులంద‌రూ చాలా బాగా కుదిరారు. శ్రీకాంత్‌గారు ప్రాణం పోశారు. ఆది పినిశెట్టి విల‌న్ పాత్ర‌లో అలా నిలిచిపోయారు. అర‌వింద్‌గారు చాలా పేష‌నేట్ నిర్మాత‌. గుండెల మీద చెయ్యి వేసుకుని సినిమా చూడ‌మ‌ని చెప్పాను. సినిమా చూసిన వారు హిట్ అంటే ఆనందంగా ఉంది. రెవెన్యూ చూసుకున్న త‌ర్వాత ఇంకా ఆనందంగా ఉంది అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.... బ‌న్నితో సినిమా చేయాల‌ని నా కోరిక‌. నేను హీరోగా చేస్తూనే మిగిలిన హీరోల సినిమాల్లో న‌టిస్తుంటాను. అర‌వింద్‌గారు పిలిచి ఈ సినిమాలో పాత్ర ఉంద‌న‌గానే కాల్షీట్ ఎప్ప‌టి నుంచి కావాలి? అని అడిగాను. త‌న బ్యాక్‌గ్రౌండ్ సెప‌రేట్‌గా ఉండాల‌నే భావ‌న బ‌న్నిలో ఉంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఆ కోరిక ఉంది. బోయ‌పాటి నా చిత్రాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేసేవాడు. అప్పుడు డైలాగులు రాసేవాడు. ఈ సినిమాతో అత‌ను ఇంకా గొప్ప ద‌ర్శ‌కుడ‌య్యాడు. ఫ్యూచ‌ర్‌లో మా అబ్బాయితో సినిమా చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాను. బ‌న్ని సెంటిమెంట్‌ను చాలా బాగా పండించాడు అని అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.... క‌థ విన్న‌ప్పుడు సినిమాపై న‌మ్మ‌కం కుదిరింది. ఆ న‌మ్మ‌కంతో ఖ‌ర్చుపెట్టాను. చిన్న‌పిల్లాడు చాక్లెట్లు అడిగిన‌ట్టు బ‌న్ని కాస్ట్ లీ కోరిక‌ల్ని కోరుతుంటాడు. బోయ‌పాటి ఈ క‌థ‌ను ఆరు నెల‌ల‌పాటు చేశాడు. త‌న‌కు మాస్ ఇమేజ్ లేద‌ని బ‌న్ని చెప్పిన‌ప్పుడు నాకు బోయ‌పాటి గుర్తుకొచ్చి కొడితే రెండు చెక్క‌లై మాస్ గుండెల్లో కూర్చునేలా చేసే వ్య‌క్తి బోయ‌పాటి అని చెప్పాను. అనుకున్న‌ట్టే చేశాడు. నేను, బ‌న్ని క‌లిసి అత‌నిపై బెట్ పెట్టాం. మా అబ్బాయికే సినిమాలంటే పిచ్చి అని అనుకుంటా. బోయ‌పాటి అంత క‌న్నా ఎక్కువ పేష‌న్‌తో ప‌నిచేశాడు. ఆది, కేథ‌రిన్‌,ర‌కుల్‌, శ్రీకాంత్ అంద‌రూ బాగా చేశారు. ఆదివారం థియేట‌ర్ల‌ను పెంచాం. సోమ‌వారం మ్యాట్నీ క‌లెక్ష‌న్లు చూసుకున్నాక నేను నిర్మాత‌గా లెక్క‌లు వేయ‌డం మొద‌లుపెట్టాను అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles