Sudeep | Mukunda Murari | Pawan kalyan | Gopala Gopala Bike | Upendra

Pawan kalyan bike in sudeep mukunda murari

Gopala Gopala Bike in Kannada Remake, Pawan kalyan bike in Mukunda Murari, Gopala Gopala Bike in Mukunda Murari, 8 lakhs paid pawan kalyan bike, Sudeep uses pawan kalyan bike, Sudeep in gopala gopala remake, Sudeep in pawan kalyan role, Upendra in Gopala Gopala, Pawan kalyan

Pawan Kalyan Bike in Sudeep Mukunda Murari: Powerstar Pawan kalyan and Victory Venkatesh hit film Gopala Gopala is remake into Kannada as Mukunda Murari title. Sudeep and Upendra acts in lead roles.

కన్నడ రీమేక్ లో 8 లక్షలకు పవన్ కళ్యాణ్ బైక్

Posted: 04/05/2016 12:53 PM IST
Pawan kalyan bike in sudeep mukunda murari

తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు ఇతర భాషలలో రీమేక్ అవుతుంటాయనే విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను వరుసగా కన్నడ భాషలోకి రీమేక్ చేసేస్తూ.. వరుసగా హిట్స్ కొట్టేస్తున్నాడు. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాలను కన్నడంలోకి రీమేక్ చేసి, ఘనవిజయం సాధించాడు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాను సుదీప్ కన్నడంలోకి రీమేక్ చేస్తున్నాడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓమైగాడ్’ చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ‘గోపాల గోపాల’ చిత్రంగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఇందులో పవన్ కళ్యాణ్ వాడిన స్పెషల్ గా డిజైన్ చేయించబడింది. ఈ బైక్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

సర్దార్ కు తొలగిన అడ్డంకులు

అలాంటిది సుదీప్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ చిత్రాన్ని కన్నడంలోకి రీమేక్ చేస్తున్నాడు. ఇందులో సుదీప్ వాడే బైక్ ను దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నారు. ఈ బైక్ సినిమాకు స్పెషల్ క్రేజ్ ను తీసుకురానుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ముకుందా మురారి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudeep  Mukunda Murari  Pawan kalyan  Gopala Gopala Bike  Upendra  

Other Articles