Prabhas | Baahubali | Special Invitations | SS Rajamouli | Anushka

Special invitations to baahubali

Special Invitations to Prabhas, Special Invitations to Baahubali, Baahubali Awards, Baahubali Best film awards, Baahubali records, Baahubali collections, Baahubali latest updates, Baahubali movie details, Baahubali shooting updates, Prabhas

Special Invitations to Baahubali: Young rebel star Prabhas latest blockbuster hit film Baahubali. SS Rajamouli direction. Rana, Anushka, Tamannah, Ramyakrishnan, Satyaraj, Prabhakar acts in lead roles. MM Keeravani Music.

బాహుబలి నుంచి ప్రభాస్ కు ప్రత్యేక ఆహ్వానాలు

Posted: 04/05/2016 10:22 AM IST
Special invitations to baahubali

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. గ్రాఫిక్స్, విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఎంతో మంది కృషి వల్లనే ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల రికార్డుల మోత మోగించింది. ఇలాంటి చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊపిరి పోసాడని చెప్పుకోవచ్చు.

బాహుబలి, శివుడు పాత్రలలో ప్రభాస్ తన నటన, యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. ప్రభాస్ తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరనిపించే విధంగా నటించి, మెప్పించాడు. అలాంటి ఈ ‘బాహుబలి’ చిత్రం గత ఏడాది జులై 10న విడుదలనప్పటికీ... ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో ప్రదర్శింపబడుతుండటం విశేషం.

ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ల యాజమానుల నుంచి రాతపూర్వకంగా ప్రభాస్ కు ఆహ్వానాలు అందాయి. తమ థియేటర్ ను ఒకసారి సందర్శించాలని ఆ ఆహ్వానంలో థియేటర్ల యాజమానులు పేర్కొన్నారు. అయితే వారి ఆహ్వానానికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించాడట. ప్రస్తుతం ‘బాహుబలి2’ షూటింగ్ లో బిజీగా వున్నానని, కానీ వీలు చూసుకొని ఖచ్చితంగా ఆయా థియేటర్లను సందర్శిస్తానని ప్రభాస్ మాటిచ్చినట్లుగా తెలిసింది.

మరి ఆయా థియేటర్లలో ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శిస్తున్నాప్పుడే ప్రభాస్ సందర్శిస్తే బాగుంటుంది... ఎందుకంటే ‘బాహుబలి’ సినిమా తీసేసిన తర్వాత వెళితే బాగుండదు కదా! ఇకపోతే ‘బాహుబలి’ని మించి మరింత పవర్ ఫుల్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘బాహుబలి2’ చిత్రాన్ని రూపొందించేందుకు రాజమౌళి చిత్ర యూనిట్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Baahubali  Special Invitations  SS Rajamouli  Anushka  

Other Articles