Rajinikanth | fans | weastage Milk | Cutouts | Movies

Court notices to rajinikanth fans on weastage milk

Rajinikanth fans weastage Milk, Rajinikanth weastage Milk, Rajini fans weastage Milk, Rajinikanth Notices to his fans, Rajinikanth cutouts milks, Rajinikanth latest updates, Rajinikanth movie news, Rajinikanth

Court Notices to Rajinikanth fans on weastage Milk: Tamil superstar Rajinikanth Fans Ordered Not to Pour Milk on His Cut-Outs by Court.

రజనీకాంత్ పాలాభిషేకాలపై రచ్చ రచ్చ

Posted: 03/31/2016 02:49 PM IST
Court notices to rajinikanth fans on weastage milk

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో రజనీకాంత్ ను ‘థలైవా’ అంటూ ప్రేమతో పిలుచుకుంటారు. అలాంటి రజనీకి సంబంధించిన ఎలాంటి శుభకార్యమైన కూడా అభిమానులు పెద్ద ఎత్తున్న సందడిగా చేస్తుంటారు. ఇక రజనీకాంత్ సినిమాలు విడుదలవుతుందంటే వారం రోజుల ముందునుంచే సందడి మొదలవుతుంది.

పెద్ద పెద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, విడుదల రోజు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు అంటూ సందడి సందడితో అభిమానులు మోత మోగిస్తుంటారు. కానీ ఇకమీదట అలాంటి పాలాభిషేకాలు కుదరదేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే రజనీకాంత్ అభిమానులు పాలాభిషేకం పేరుతో పాల వృధాపై బెంగుళూరులోని ఓ కోర్టులో ఇంజక్షన్ సూట్ దాఖలైంది.


Video Source: Mango Music

రజనీకాంత్ సినిమాలు విడుదల సంధర్భంగా పోస్టర్లను అభిషేకించడానికి వేల లీటర్ల పాలను వృధా చేస్తున్నారని.. అలా పాలను వృధా చేయకుండా రజనీకాంత్ కు మరియు అతని అభిమానులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై కోర్టు రజనీకాంత్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.

మరి ఈ విషయంపై రజనీకాంత్ కు సానుకులంగా స్పందించి.. అదే పాలను, పూలను వృధా చేయకుండా నిరుపేదలకు సహాయ కార్యక్రమాలను అందించే విధంగా రజనీకాంత్ తన అభిమానులకు పిలుపునిస్తే బాగుంటుంది. మరి రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Fans  Weastage Milk  Court Notices  Movies  

Other Articles