Arjun Kapoor | slapped | Radio Jockey | KI and KA | Kareena Kapoor

Arjun kapoor slapped a rj

Arjun Kapoor slapped a Radio Jockey, KI and KA movie songs, KI and KA trailers, KI and KA videos, Arjun Kapoor movies, Arjun Kapoor stills, Kareena Kapoor latest news, Kareena Kapoor movies, Kareena Kapoor stills

Arjun Kapoor slapped a RJ: Arjun Kapoor & Kareena Kapoor starring, R. Balki directed upcoming movie KI & KA whose story revolves around a young, married couple whose relationship challenges the gender roles placed upon women and men in Indian society. The song is Mithoon (ft. Deepali) in the lyrics of Sayeed Quadri & music composed, arranged and programmed by Mithoon himself.

రేడియో జాకీ చెంప చెళ్లుమనిపించిన అర్జున్ కపూర్

Posted: 03/31/2016 10:33 AM IST
Arjun kapoor slapped a rj

సినిమా ప్రమోషన్లు ఎంత కొత్తగా వుంటే.. అంత ఎక్కువగా ఆ సినిమాలకు ప్రాచుర్యం వస్తుందనే విషయం తెలిసిందే. ప్రమోషన్స్ అనేవి కొత్తగా, వెరైటీగా వుండకపోయినా పర్వాలేదు కానీ మరీ చెత్తగా, ఇతరులను ఇబ్బంది పెట్టేవిధంగా మాత్రం వుండకూడదంటూ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ పై ప్రస్తుతం భారీ విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

అర్జున్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కీ అండ్ కా’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా వున్నారు. ఇందులో భాగంగా అర్జున్ కపూర్ ముంబైలోని రేడియో మిర్చిలో పాల్గొన్నాడు.

అక్కడ ఆర్.జె అడిగిన ఓ ప్రశ్నకు.. సహనం కోల్పోయిన అర్జున్ కపూర్ అతనిపై చేయిచేసుకున్నాడు. కెమెరాలను విసిరిగొట్టాడు. సినిమాల్లో నటించడానికి ఎలాంటి పాత్రలు దొరకకపోవడంతోనే అమ్మాయిలకు సంబంధించిన పాత్రలు వేస్తున్నారా అంటూ అర్జున్ కపూర్ ను ఆర్.జె ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన అర్జున్ కపూర్... అతని చెంప చెళ్లుమనిపించాడు.

ఆర్.జె. చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసినవాళ్లల్లో కొంతమంది ఇదంతా సినిమా ప్రమోషన్స్ లలో ఒకభాగమని అంటుంటే.. మరికొంతమందేమో... ఏప్రిల్ ఫూల్ చేయడానికే అర్జున్ కపూర్ ఇలా ఆర్.జె.తో కలిసి ఇలా చేసాడంటూ వార్తలొస్తున్నాయి. ఏదేమైనా మరి పబ్లిసిటీ కోసం ఇంత చెత్తగా ప్రవర్తించాలా అంటూ సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ పై విమర్శలు వచ్చిపడుతున్నాయి.

ఇక ‘కీ అండ్ కా’ సినిమా విషయానికొస్తే.... ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ లు ప్రత్యేక పాత్రలలో నటించారు. భర్త ఇంటి పనులు చేయడం, భార్య ఆఫీస్ కు వెళ్లి పనిచేయడం అనే కాన్సెప్టుతో రూపొందింది. ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Kapoor  slapped  Radio Jockey  KI and KA  Trailers  

Other Articles