Sardaar Gabbar Singh | Trailer Run Time | Theaters list | Pawan Kalyan | Teaser

Sardaar gabbarsingh worldwide theaters list

Sardaar Gabbarsingh Trailer Run Time, Sardaar Gabbarsingh Theaters list, Sardaar Gabbarsingh Teaser, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Worldwide Theaters List: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

ట్రైలర్ రన్ టైం ఫిక్స్... 42 దేశాల్లో ‘సర్దార్’ గ్రాండ్ రిలీజ్

Posted: 03/19/2016 04:17 PM IST
Sardaar gabbarsingh worldwide theaters list

సౌత్ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి భారీ ఎత్తున మొదలయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేసి అందరికి షాక్ ఇచ్చేసింది. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హంగామా కనిపిస్తోంది. టీవిలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో ‘సర్దార్’ టీజర్ అదరగొడుతోంది.

ఒక్క టీజర్ విడుదలైతేనే ఇంత హంగామా వుందంటే... ట్రైలర్ విడుదలైతే అభిమానుల సంతోషాలకు హద్దులుండవు. అలాంటి పవర్ స్టార్ అభిమానులకు మరో శుభవార్త. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ సిద్ధమయ్యింది. ఈ ట్రైలర్ వీడియో 171 సెకన్లు (2:51 minutes) వుండనుంది. ఈ ట్రైలర్ ను రేపు(మార్చి 20) ఆడియో వేడుక కార్యక్రమంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను రేపు(మార్చి 20)న హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో, అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రాంచరణ్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు అర్జున్, నిహారిక, అల్లు అరవింద్ తో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.

తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హిందీలో ఇప్పటికే భారీ క్రేజ్ వచ్చింది హైవోల్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలలో విడుదల చేయనున్నారు. ఆ దేశాల జాబితా మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజన ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.

Africa:
South Africa - Johannesburg , Cape Town
Zambia - Lusaka
Botswana - Gaborone
Tanzania - Dar-es-Salam, Arusha
Ghana - Accra
Ethiopia - Addis Abbaba
Uganda - Kampala
Kenya - Nairobi
Nigeria – Lagos

Middle East:
70 Locations in
UAE
Kuwait
Muscat
Bahrain - Alhambra ,
Egypt - Cairo
Lebanon - Beirut
Iraq
Jordan

Australia:
Australia
New Zealand

Asia:
Singapore
Malaysia
Thailand - Bangkok
Sri Lanka
Nepal
Japan

Europe:
Germany
Switzerland
Belgium
Netherlands
Denmark
Sweden
Norway
Finland
Italy
Poland
Ukraine
Austria
Ireland
UK

North America:
USA
Canada

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles