Amitabh bachchan | compliments | Taapsee pannu | Pink Movie | stills

Amitabh bachchan talks about taapsee pannu

Amitabh bachchan compliments to Taapsee pannu, Amitabh bachchan comments on Taapsee pannu, Amitabh bachchan talks about Taapsee, Taapsee pannu latest stills, Taapsee pannu hot stills

Amitabh bachchan talks about Taapsee pannu: Bollywood star Big B Amitabh bachchan compliments to young heroine Taapsee pannu about her films and pink film.

తాప్సీ కొత్త భామ కాదంటున్న బిగ్ బి

Posted: 03/19/2016 11:27 AM IST
Amitabh bachchan talks about taapsee pannu

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, మొగుడు, షాడో వంటి పలు తదితర చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ చిత్రాల్లో వస్తున్న ఆఫర్లలో నటిస్తూనే బాలీవుడ్ పై కన్నేసిన ఈ అమ్మడికి అక్కడ కూడా వరుస ఆఫర్లను వచ్చిపడుతున్నాయి.

అలాంటి ఈ అమ్మడు ఇప్పటికే హిందీలో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాంటి తాప్సీపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించాడు. దీంతో తాప్సీ తెగ సంబరపడిపోతుంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న ‘పింక్’ మూవీలో నటిస్తున్నారు. దుబాయ్ లో శుక్రవారం జరిగిన ఓ సినిమా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అమితాబ్.. ‘పింక్‘ సినిమా గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

తాప్సీ లాంటి కొత్త అమ్మాయిలతో స్క్రీన్ షేర్ చేసుకోవండపై మీడియా అడిగిన ప్రశ్నకు అమితాబ్ స్పందిస్తూ... తాప్సీ కొత్త హీరోయినేం కాదు. ఇప్పటికే ఆమె రెండు హిందీ సినిమాల్లో నటించింది. అంతకుమించి మంచి ప్రొఫెషనల్’ అంటూ తాప్సీపై బిగ్ బి ప్రశంసలు కురిపించారు. అమితాబ్ ప్రశంసలకు తాప్సీ తెగ సంబరపడిపోతూ... ‘అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండితెరపై నాపేరు రాబోతుందనే విషయం తలుచుకుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది’ అని తాప్సీ తెగ సంతోషపడిపోతుంది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ ‘పింక్’ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సుజిత్ సర్కార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో తాప్సీకి ఎలాంటి పేరొస్తుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taapsee pannu  Amitabh bachchan  compliments  Pink Movie  hot stills  

Other Articles