Kannada Actor | Darshan | abusing wife | Vijayalakshmi

Actor darshan abusing his wife vijayalakshmi

Actor Darshan accused of abusing wife again, Darshan accused of abusing, Darshan abusing wife, Darshan abusing Vijayalakshmi, Actor Darshan abusing case, Actor Darshan wife issue, Actor Darshan latest news, Actor Darshan family

Actor Darshan abusing his wife Vijayalakshmi: Sandalwood actor Darshan is in the dock again, after his wife Vijayalakshmi approached the police, and urged them to advise the 'Challenging.

భార్యపై బూతులతో రెచ్చిపోయిన హీరో వాయిస్

Posted: 03/12/2016 11:12 AM IST
Actor darshan abusing his wife vijayalakshmi

కన్నడ హీరో దర్శన్ సంసారంలో ఓ ఆడియో టేప్ సంచలనం సృష్టిస్తోంది. దర్శన్ జీవితంలో వచ్చిన ఓ సమస్య ఇపుడు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దర్శన్ తన భార్య విజయలక్ష్మీని అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా ఓ ఆడియో టేప్ వాట్సప్ లో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటికే ఈ ఆడియో టేప్ వార్త శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆడియో టేప్ లో అత్యంత అసభ్యపదజాలంతో కూడా మాటలు వినిపించాయి. అయితే ఈ ఆడియోలో వినిపించిన గొంతు దర్శన్ ది కాదని ఆయన భార్య విజయలక్ష్మీ చెబుతోంది. దర్శన్ తో పదమూడేళ్లుగా కలిసి వుంటున్నానని, ఆయన నోటి వెంట ఎప్పుడూ అలాంటి పదాలను తాను వినలేదని ఆమె చెబుతోంది. తమ మధ్య వున్న మనస్పర్థలను ఉపయోగించుకొని ఎవరో ఇదంతా కావాలనే కల్పించి చేస్తున్నారని విజయలక్ష్మీ పేర్కొన్నారు.

ఈ ఆడియో టేప్ విషయంపై విజయలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్ ను విచారిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయమే పోలీసులు విచారణలో దర్శన్ పాల్గొనాలి. కానీ.. తన తల్లికి అనారోగ్యంగా వుందనే కారణంతో సాయంత్రం విచారణకు హాజరవుతానని దర్శన్ పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. అలాగే దర్శన్-విజయలక్ష్మీల మధ్య వచ్చిన మనస్పర్థలను తొలగించి, వీరిద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు రాష్ట్ర మహిళా కమీషన్ తో పాటు సీనియర్ నటుడు అంబరీష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అసలు ఈ ఆడియో టేప్, వీరిద్దరి దాంపత్య జీవితం ఎలాంటి మలుపులు తిరగనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Darshan  Abusing  wife  Vijayalakshmi  audio tape  

Other Articles