Director Rajesh Pillai | Passed away | Vettah

Director rajesh pillai passed away

Director Rajesh Pillai died, Director Rajesh Pillai passed away, Director Rajesh Pillai death news, Director Rajesh Pillai movies, Director Rajesh Pillai Vettah, Rajesh Pillai movies, Rajesh Pillai Vettah review, Vettah review, Rajesh Pillai vettah talk, Rajesh Pillai

Director Rajesh Pillai Passed away: Rajesh Pillai (41), one of Malayalam's promising new-age ... Hospital authorities confirmed the death of the director whose latest film Vettah.

సినిమా కోసం ప్రాణాలొదిలేసిన దర్శకుడు

Posted: 02/27/2016 03:30 PM IST
Director rajesh pillai passed away

ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు రాజేష్ పిళ్లై(41) మృతి చెందారు. సినిమా కోసమే బ్రతికే కొంతమంది వ్యక్తులలో రాజేష్ పిళ్లై ఒకరని చెప్పుకోవచ్చు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేష్.. ఈ శుక్రవారం విడుదలైన ‘వేట్టా’ సినిమా కోసం తన ఆపరేషన్ ను వాయిదా వేసుకున్నారు. దీంతో పరిస్థితి విషమంగా మారి శనివారం తుది శ్వాస విడిచారు.

రాజేష్ గతంలోనే కాలేయ మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి వుంది. కానీ ‘వేట్టా’ సినిమా పూర్తి చేయాలనే వుద్దేశ్యంతో ఆపరేషన్ ను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ‘వేట్టా’ సినిమా విడుదలయ్యే వరకు చికిత్సను వాయిదా వేసారు. సినిమా విడుదలయ్యేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11:45 నిమిషాలకు రాజేష్ తుదిశ్వాస విడిచారు.

రాజేష్ రూపొందించిన చిత్రాలకు మంచి ప్రశంసలు దక్కాయి. అవయవదానం నేపథ్యంలో రాజేష్ పిళ్లై రూపొందించిన ‘ట్రాఫిక్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను కూడా సాధించిపెట్టింది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయగా.. అక్కడ మంచి విజయం సాధించాయి. అలాగే రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘మిలి’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. అలాంటి గొప్ప చిత్రాలను అందించిన రాజేష్ పిళ్లై ఎక్కడున్న తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajesh Pillai  Passed away  Vettah  stills  

Other Articles