స్వాతిరెడ్డి అనే యువనటి నిన్న పోలీస్ స్టేషన్లో తన తల్లితో పాటు గొడవపడిన విషయం తెలిసిందే. తన కూతురుని శ్రీనివాస్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి, ఆస్తి కోసం కిడ్నాప్ చేసాడంటూ స్వాతి రెడ్డి తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్వాతిరెడ్డిని పిలిచి విచారించగా.. ఆస్తి కోసమే తన తల్లి ఇబ్బంది పెడుతోందంటూ స్వాతిరెడ్డి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్ స్టేషన్లోనే తల్లి కూతుళ్ల మధ్య పరస్పర వివాదం ఏర్పడింది. పోలీసులు వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వాతిరెడ్డిని ఇంటికి పంపించారు. నాగేంద్రమ్మను పోలీసులు విచారిస్తున్నారు.
అయితే ఈ విషయంపై స్వాతిరెడ్డి స్పందిస్తూ... ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన గొడవ కాదని, డబ్బుకు సంబంధించన గొడవ మాత్రమేనని స్పష్టం చేసింది. స్వాతిరెడ్డి మాట్లాడుతూ... తన తల్లిని ఇటీవలే అకౌంట్ లో ఎంత డబ్బు వుందని అడగగా మా ఇద్దరికి చిన్న గొడవలు అయ్యాయి. దీంతో నేను రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత అమ్మకు కోపం వచ్చి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే డబ్బుల విషయంలో పోలీసుల వద్దకు వస్తే బాగుండదని.. శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఫిర్యాదు చేసిందని స్వాతిరెడ్డి తెలిపింది.
అయితే శ్రీనివాస్ రెడ్డితో ప్రేమ వ్యవహారం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కారణం అదే. తన స్నేహితులలో శ్రీనివాస్ రెడ్డి పేరు, నంబర్ మాత్రమే తెలుసు కాబట్టి.. పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి పేరు తెలిపింది. శ్రీనివాస్ రెడ్డి పేరును నమోదు చేయవద్దని, అనవసరంగా అతనిని ఇందులో తీసుకురావద్దని తన తల్లితో గొడవ పడ్డానని స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. కానీ తన తల్లి అంటే ఇష్టమని, నిజానికి మా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరిగాయి.. కానీ ఇపుడు మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేసింది. అసలు శ్రీనివాస్ రెడ్డిని ఇందులోకి తీసుకురాకండి.. పాపం అతనిని ఎక్కువగా కలిసిన దాఖలలు కూడా లేవని స్వాతిరెడ్డి స్పష్టం చేసింది.
తన తల్లి డబ్బులు ఇచ్చేసాక పోలీస్ స్టేషన్లో తన తల్లి నిజాన్ని ఒప్పుకుంది. తన సెల్ ఫోన్లో శ్రీనివాస్ రెడ్డి నంబర్ వుండటం వల్లనే ప్రేమ వ్యవహారం వల్లనే తాను బయటకు వెళ్లిపోయానని భావించి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. అయితే శ్రీనివాస్ రెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పాపం అతనిని నేను కలవనే లేదు. అతనికి కూడా ఓ ఫ్యామిలీ వుంది. అనవసరంగా అతని పేరు తీయకండి అని స్వాతిరెడ్డి రిక్వెస్ట్ చేసింది. మొత్తానికి స్వాతిరెడ్డి గొడవ ఎట్టకేలకు ప్రేమ వ్యవహారం వల్ల కాదని... కేవలం డబ్బు సమస్య వల్లనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారని తేలిపోయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more