Sai Dharam Tej | Gang Leader | Supreme | Rashi khanna

Sai dharam tej as gang leader

Sai Dharam Tej next film title Gang Leader, Sai Dharam Tej as Gang Leader, Sai Dharam Tej supreme teaser, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej love, Sai Dharam Tej

Sai Dharam Tej as Gang Leader: Supreme hero Sai Dharam Tej busy in supreme movie shooting. his next film title Gang Leader. gopichand malineni director.

మెగాస్టార్ టైటిల్ తో ‘సుప్రీం’ హీరో

Posted: 02/24/2016 06:26 PM IST
Sai dharam tej as gang leader

‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఇప్పటికే తన యాక్టింగ్, డాన్సులతో ఆకట్టుకున్న సాయిధరమ్ తేజ... తన గత చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే ప్రస్తుతం సాయిధరమ్ తేజ నటిస్తున్న చిత్రానికి ‘సుప్రీం’ అంటూ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ను వాడుకోగా... తన తర్వాతీ చిత్రానికి చిరంజీవి మరో సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. తేజు తన తర్వాతీ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను ఖరారు చేసారని తెలిసింది.

సాయిధరమ్ తేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ కు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని నల్లమలపు శ్రీను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ నటిస్తున్న ‘సుప్రీం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Gang Leader  Supreme  teaser  stills  

Other Articles