One more star Hero in NTRs janata garage

One more star hero in ntrs janata garage

NTR, NTRs Janata Garage, Koratala Shiva Janata Garage, NTRs latest News, Sai Kumar, Mohan Lal

Dailouge King Sai Kumar acting as father to NTR in Koratala Shivas Janata garage. Mohan Lal, Sai Kumar acting in Janata garage.

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తండ్రిగా స్టార్ హీరో

Posted: 02/22/2016 01:45 PM IST
One more star hero in ntrs janata garage

జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా జనతా గ్యారేజ్ లో నటిస్తున్న నటుల జాబితా చూసి టాలీవుడ్ జనాలు అవాక్కవుతున్నారు. ఒక్క తెలుగు స్టార్సే కాదు మళయాల ఇండస్ట్రీ మీద కూడా ఎన్టీఆర్ కన్నేశారు. అందుకే ఆ సినిమాలో పలువురు మళయాల స్టార్స్ కూడా ఉన్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో జనతా గ్యారేజ్ లో నటిస్తున్నట్లు ఖరారైంది. తన డైలాగులతో సినిమా ఇండస్ట్రీలో ఓ వైవిధ్య స్థానాన్ని అందుకున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు సాయి కుమార్ తండ్రిగా నటిస్తున్నట్లు తెలిసింది. మలయాళ నటులు మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు పెదనాన్నగా మోహన్ లాల్ నటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  NTRs Janata Garage  Koratala Shiva Janata Garage  NTRs latest News  Sai Kumar  Mohan Lal  

Other Articles