Teaser Of Nagarjuna’s ‘Oopiri’ To Be Unveiled On tomarrow

Teaser of nagarjuna s oopiri to be unveiled on tomarrow

Nagarjuna, nagarjunas oopiri, karthi, Oopiri teaser, PVP

Nagarjuna’s last offering ‘Soggade Chinni Nayana’ entertained the audiences this Ponagl, since then they are waiting for his next film. His forthcoming film ‘Oopiri’ was wrapped up recently. The team of the film is now gearing up for the release of the teaser of the film.

నాగార్జున, కార్తీ మల్టీస్టార్ ఊపిరి టీజర్ డేట్

Posted: 02/19/2016 01:50 PM IST
Teaser of nagarjuna s oopiri to be unveiled on tomarrow

సోగ్గాడే చిన్నినాయన సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున తర్వాత సినిమా ఊపిరిని త్వరలోనే ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ్, తెలుగు బాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ సినిమా మీద రెండు సినిమా ఇండస్ట్రీలో చర్చసాగుతోంది. మల్టీస్టార్ సినిమాగా వస్తున్న ఊపిరిలో నాగార్జున, కార్తీ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అలరించగా.. తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. అలాగే సినిమా టీజర్ ఎప్పుడు లాంఛ్ చేస్తున్నారో కూడా టీం వెల్లడించింది.

ఇటు తెలుగు సినిమా, అటు తమిల్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఊపిరి సినిమా టీజర్ ను రేపు విడుదల చెయ్యనున్నారు.  ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజునే ఫస్ట్ టీజర్ విడుదల కావాల్సి ఉన్నా అప్పుడు అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా టీమ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ డేట్‌ను టీమ్ ప్రకటించింది. ఫిబ్రవరి 20న ‘ఊపిరి’ ఫస్ట్‌ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. నాగార్జున, కార్తీ, తమన్నా, అనుష్క, అడివి శేష్.. ఇలా భారీ తారాగణమే కనిపించనున్న ఈ సినిమా ‘సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  nagarjunas oopiri  karthi  Oopiri teaser  PVP  

Other Articles