Mahesh Babu waiting for that movie

Mahesh babu waiting for that movie

Mahesh babu, Mahesh babu in Sri Sri Audio, Super Star Krishna, Sri Sri, Krishna in Sri Sri

Super Star mahesh Babu waiting for his Father, Super Star Krishna's Sri Sri cinema. He launched Sri Sri audio and trailer.

ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నా: మహేష్ బాబు

Posted: 02/19/2016 11:05 AM IST
Mahesh babu waiting for that movie

చిన్నప్పుడు ఆయన సినిమాలు చూడాలని ఎంతలా అయితే ఎదురుచూశానో.. ఇప్పుడు కూడా అంతే ఆత్రుతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నానని సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా..? తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నటించిన శ్రీశ్రీ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సినిమా ఆడియో, ట్రైలర్ లాంఛ్ కు హాజరైన మహేష్ బాబు తన చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు నాన్నగారి సినిమా కోసం ఎంతో ఎదురుచూసే వాడినని.. ఇప్పుడు కూడా శ్రీశ్రీ సినిమా కోసం అంతే ఎదురుచూస్తునానని తెలిపారు.

ఇక ఓ కొడుకుగా నాకిది మర్చిపోలేని రోజని మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ తన సినిమా ఫంక్షన్లకు నాన్న వస్తారని అయితే ఇప్పుడు నాన్న సినిమా ఫంక్షన్ కి తాను రావడం ఈ జీవితంలో మర్చిపోలేని రోజుని సంతోషంగా చెప్పాడు.  శ్రీ శ్రీ సినిమాతో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు హీరోగా కనిపించబోతున్న కృష్ణ సినీ కెరీర్ 50ఏళ్లు ముగిసిన సందర్భంగా మా అసోసియేషన్ ఆయన్ను సన్మానించింది. మహేష్ బాబు చేతుల మీదుగా జ్ఞాపికను కృష్ణకు అందజేశారు మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles