Prakash Raj | Pony Verma | blessed | baby boy | Tweets

Prakash raj pony verma blessed with a baby boy

Prakash Raj blessed with a baby boy, Prakash Raj with a baby boy, Prakash Raj Pony Verma blessed with a baby boy, Pony Verma blessed with a baby boy, Prakash Raj Pony Verma blessed, Prakash Raj latest news, Pony Verma latest news

Prakash Raj Pony Verma blessed with a baby boy: Prakash Raj and his choreographer wife Pony Verma have welcomed a baby boy. Prakash Raj tweets about this special news.

మళ్లీ తండ్రయ్యిన ప్రకాష్ రాజ్.. పండంటి బాబు

Posted: 02/03/2016 03:03 PM IST
Prakash raj pony verma blessed with a baby boy

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చాలా సంతోషంగా వున్నారు. ఇందుకు గల కారణం ప్రకాష్ రాజ్ కు బాబు పుట్టాడు. ఇటీవలే బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

తమకు బాబు పుట్టాడని ప్రకాష్ రాజ్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. భార్య పోనీ, తాను చాలా సంతోషంగా ఉన్నామన్నామని, మాకు ఓ లవ్లీ బాబు పుట్టాడు. తమ బిడ్డను ఆశీర్వదించండి అంటూ ట్విట్ చేశాడు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలితతో ఇటీవలే విడిపోయి, అనంతరం పోనీవర్మను వివాహం చేసుకున్నాడు. లలిత, ప్రకాష్ రాజ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2004లో ఓ ప్రమాదంలో అయిదేళ్ల కొడుకును పోగొట్టుకోవడం ప్రకాష్ రాజ్ జీవితంలో పెద్ద విషాదంగా మిగిలింది. ఇపుడు ఈ బాబు రూపంలో మళ్లీ ఆయన జీవితంలో కొత్త సంతోషాలను తీసుకొచ్చాయని అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Pony Verma  blessed  Baby Boy  Tweets  

Other Articles