Sukumar | Devi sri prasad | Movie News | Stills

Sukumar talks about devi sri prasad film updates

Sukumar talks about Devi sri prasad film, Sukumar Devi sri prasad film, Sukumar upcoming films, Sukumar upcoming movies, Sukumar latest news, Sukumar movie news, Sukumar latest updates, Sukumar, DSP stills, DSP songs

Sukumar talks about Devi sri prasad film updates: Tollywood director sukumar next film with south indian music director devi sri prasad.

కోనసీమలో సౌత్ ఇండియర్ రాక్ స్టార్

Posted: 02/01/2016 01:38 PM IST
Sukumar talks about devi sri prasad film updates

సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇప్పటివరకు తన సంగీతం, డాన్సులతో అదరగొడుతూ... ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఏ విషయం కూడా బయటకు రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు విషయంపై సుకుమార్ మౌనం వీడారు. ఇటీవలే తాను తీసిన ’నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తూ తన స్నేహితులను, బంధువులను కలుస్తూ రిలాక్స్ అవుతున్నారు.

ఈ సంధర్భంగా అక్కడ మీడియా వారితో తన తర్వాతీ సినిమా గురించి మాట్లాడుతూ... దేవిశ్రీప్రసాద్ తో తాను చేయబోయే తర్వాతీ సినిమా కోసం కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుండనుందని సుకుమార్ స్పష్టం చేసారు. అదే విధంగా తన తర్వాతీ చిత్రాలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయడానికి ఓకే అయినట్లుగా సుకుమార్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sukumar  Devisriprasad  interview  upcoming movies  stills  

Other Articles