Nannaku Prematho | Political Problems | NTR | Theaters list

Political pressure on nannaku prematho tickets

Political Problems for Nannaku Prematho, Theaters Problems for Nannaku Prematho, Nannaku Prematho Theaters Problems, Theaters war Nannaku Prematho, Nannaku Prematho vs Dictator, Nannaku Prematho theaters list, Nannaku Prematho hot news, Nannaku Prematho movie updates, Nannaku Prematho

Political Pressure On Nannaku Prematho Tickets: Young tiger Ntr Nannaku Prematho film will be release on 13 january. Nandamuri Balakrishna Dictator film will be release on 14 january.

‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి పొలిటికల్ ప్రెజర్

Posted: 01/12/2016 12:09 PM IST
Political pressure on nannaku prematho tickets

‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి13) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా టికెట్ల కోసం గతవారం రోజుల నుంచే ఎన్టీఆర్ అభిమానులు తెగ ప్రయత్నిస్తున్నారు.

ఎలాగైనా మొదటిరోజు, మొదటి షో చూసేయ్యాలని ఎన్టీఆర్ అభిమానులు ప్రయత్నిస్తున్నప్పటికీ... టికెట్ల కొరత ఏర్పడుతోంది. దీనివల్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. టికెట్ల విషయంలో పొలిటికల్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువయ్యిందట. అయినా కూడా టికెట్లు లభించడం లేదట. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా.. చివరకు ఎన్టీఆర్ చెవిన పడటంతో.. ఈ విషయంపై ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.

టికెట్ల విషయంలో ఎన్టీఆర్ ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూ... అవును.. టికెట్ల విషయంలో పొలిటికల్ ప్రెజర్ చాలా వుంది. ఫస్ట్ డే టికెట్స్ కావాలని చాలా మంది అభిమానులు ప్రయత్నిస్తున్నారు. నా చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు అభిమానుల కోసం థియేటర్లలో టికెట్లు అందరికి దొరికే విధంగా అందుబాటులో వుంచుతారనే నమ్మకం వుందని చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టికెట్ల కోసం ప్రస్తుతం థియేటర్ల వద్ద పెద్ద క్యూ ఏర్పడ్డాయి. ఆన్ లైన్ బుకింగ్స్ లో కూడా ‘నాన్నకు ప్రేమతో’ టికెట్లు హౌస్ ఫుల్ గా వుండటం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. తమకు టికెట్లు దొరకకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని చాలా స్టైలిష్ ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు, ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nannaku Prematho  Political Problems  NTR  Theaters list  

Other Articles