Nagarjuna | Soggade Chinni Nayana | Naga Chaitanya | Akhil | promotions | Lavanya Tripati

Naga chaithanya and akhil in soggade chinni nayana promotions

Akkineni young stars in Soggade Chinni Nayana promotions, Soggade Chinni Nayana Latest Trailer, Nagarjuna Soggade Chinni Nayana interview, Soggade Chinni Nayana latest news, Soggade Chinni Nayana movie news, Soggade Chinni Nayana release date, Soggade Chinni Nayana trailers, Soggade Chinni Nayana audio date, Soggade Chinni Nayana movie stills, Soggade Chinni Nayana posters, lavanya tripati, Ramyakrishna

Naga Chaithanya and Akhil in Soggade Chinni Nayana promotions: Starring Nagarjuna in a dual role while Ramya Krishnan and Lavanya Tripathi would be seen as the female leads, directed by debutante director Kalyan Krishna and produced by Annapurna Studios.

వారెవ్వా.. సొగ్గాడి కోసం పంచెకట్టులో అక్కినేని తారలు

Posted: 01/12/2016 10:53 AM IST
Naga chaithanya and akhil in soggade chinni nayana promotions

‘మనం’ వంటి క్లాసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వీయ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘సొగ్గాడే చిన్ని నాయనా’. ఈ చిత్రం ఈనెల 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. ఇప్పటికే నాగార్జున పలు ఇంటర్వ్యూలతో బిజీగా వున్నారు. అయితే తమ సొంత బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో నాగార్జున ‘బంగార్రాజు’ పాత్రకోసం పంచెకట్టులో కనిపించిన విషయం తెలిసిందే.

ఇదే గెటప్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లు కనిపించి, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పంచె కట్టులో ముగ్గురు కూడా చాలా అందంగా వున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పంచె కట్టులో అఖిల్ కు ఆ గెటప్ బాగా సెట్ అయ్యినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కోసం ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లో పాల్గొంటుందని అర్థమవుతోంది. వీరు ముగ్గురితో రూపొందిన ఓ ఇంటర్వ్యూను సంక్రాంతి కానుకగా ప్రసారం చేయనున్నారు.

నాగార్జున ‘బంగార్రాజు’, ‘రాము’ అనే రెండు పాత్రల్లో నటించారు. బంగార్రాజుకు జోడిగా రమ్యకృష్ణ, రాముకు జోడిగా లావణ్య త్రిపాఠీ జతకట్టారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. పల్లెటూరి వాతావారణంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Soggade Chinni Nayana  Naga Chaitanya  Akhil  promotions  Lavanya Tripati  

Other Articles