Pawan kalyan | Sardaar Gabbar singh | Selfy | First Look Poster

Pawan kalyan sardaar gabbar singh team selfy

Sardaar Gabbar singh Team selfy, Pawan kalyan Enjoy with Sardaar Gabbar singh Team, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Sardaar Gabbar singh Team selfy: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

పవన్ కళ్యాణ్ గ్యాంగ్ సెల్ఫీ హంగామా

Posted: 01/08/2016 12:51 PM IST
Pawan kalyan sardaar gabbar singh team selfy

‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసే కొన్ని అల్లరి ఫోటోలను ఇటీవలే విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ కు ఆలీ, బ్రహ్మాజీలు కలిసి తుపాకీ ఎలా కాల్చలో నేర్పిస్తున్నట్లుగా వుండే ఫోటోలను ఇటీవలే విడుదల చేసారు. ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో చేస్తున్న ‘జబర్దస్త్’ గ్యాంగ్ ఓ సెల్ఫీ ఫోటోను విడుదల చేసారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో వేణు, షకలక శంకర్, సుడిగాలి సుధీర్ కలిసి దిగిన ఓ ఫోటోను తాజాగా విడుదల చేసారు. ఇందులో వీరు కానిస్టేబుల్స్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి సర్దార్ స్టేషన్లో వీరి కామెడీ ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

ఇటీవలే గుజరాత్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోని భూత్ బంగ్లా దగ్గర దాదాపు 4.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఓ భారీ స్పెషల్ సెట్లో షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు నేటి నుంచి 25 రోజులపాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్, కాజల్ తో పాటు రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులోని ఓ ముఖ్యమైన పాత్రలో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ నటించడంతో పాటుగా పవన్ తో కలిసి రెండు మాస్ మసాలా పాటల్లో చిందులేస్తుంది. యువ నటి సంజన కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Selfy  First Look Poster  Stills  

Other Articles