Rajinikanth | police certificate | 2.0 | stills

Rajinikanth wants police certificate for 2 0

Rajinikanth needs police certificate, Rajinikanth wants police certificate, Rajinikanth police certificate, Rajinikanth bolivia, Rajinikanth latest news, Rajinikanth police news, Rajinikanth latest updates, Rajinikanth stills

Rajinikanth wants police certificate for 2.0: sources director Shankar has planned to shoot some portions of the mega budget sci-fi thriller '2.0' in Bolivia and the team.

సర్టిఫికెట్ వస్తేనే అక్కడ సూపర్ స్టార్ కు ఎంట్రీ

Posted: 01/08/2016 11:13 AM IST
Rajinikanth wants police certificate for 2 0

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు సర్టిఫికెట్ కావాలంటూ చెన్నై నగరపోలీస్ కమీషనర్ ను కోరారు. ఇంతకీ ఏంటీ ఆ సర్టిఫికెట్ అని అనుకుంటున్నారా? ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘2.0’(రోబో2). శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా సంస్థ నిర్మిస్తుంది. రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించడానికి యూనిట్ పక్కా ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాకోసం బొలివియా దేశంలో షూటింగ్ చేయనున్నారు. ఆ దేశంలో షూటింగ్ చేయాలంటే అక్కడి విధివిధానాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. అదేంటంటే... వృత్తి రీత్యా ఆ దేశానికి వెళ్లే వాళ్లపై ఎలాంటి కేసులు ఉండకూడదు. ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసుల నుంచి ధ్రువపత్రం(సర్టిఫికెట్) పొంది బొలివియా దేశ అధికారులకు అందిస్తేనే.. ఆ దేశంలో అడుగుపెట్టగలరు.

అందువల్ల ఈ సినిమా షూటింగ్ కోసం బొలివియా వెళ్లనున్న రజనీకాంత్ తనపై ఎలాంటి నేరారోపణలు, కేసులు లేవని సర్టిఫికెట్ కోరుతూ చెన్నై నగర పోలీస్ కమీషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. పోలీస్ కమీషనర్ నుంచి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రజనీకాంత్ బొలివియా దేశం వెళ్లే అవకాశం వుంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  police certificate  2.0  Bolivia  stills  

Other Articles