తమిళ హీరో శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లు కలిసి రూపొందించిన ఓ ‘బీప్ సాంగ్’ పై ప్రస్తుతం తమిళనాడులో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై శింబు, అనిరుధ్ లను అరెస్ట్ చేయాలని పోలీసులు కూడా సిద్ధమయ్యారు. అయితే అరెస్ట్ వారెంట్ జారీ అవడంతో గతకొద్ది రోజులుగా శింబు ఎవరి కంటా పడకుండా వున్నాడు. అనిరుధ్ మ్యూజికల్ షో కోసం కెనడా వెళ్లాడు. అయితే వీరు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు ప్రకటించడంతో.. ఎట్టకేలకు శింబు మీడియా ముందుకు వచ్చాడు.
శింబు తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ఆడవాళ్లను కించపరుస్తూ ఈ పాట పాడనంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అసలు నేను ఈ పాటలో అమ్మాయిలను కించపరుస్తూ పాడలేదు. కేవలం అబ్బాయిలు పొగతాగొద్దు, మద్యం సేవించొద్దు, ఉద్యోగాలు మానుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఓ సందేశంతో దీన్ని రూపొందించాను. ఒక పాట కోసం నా దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఫోటోలకు చెప్పులదండ వేస్తున్నారు. అంతగా నేనేం తప్పుచేసాను? రేప్ చేసిన వ్యక్తి కూడా బయట హాయిగా తిరుగుతున్నాడు కానీ నన్ను ప్రత్యేకించి ఇలాంటి సమస్యల్లోకి నెడుతుండటం చాలా బాధ కలిగిస్తోంది అని శింబు చెప్పుకొచ్చాడు.
శింబు మాట్లాడుతూ... నేనేం పనిగట్టుకొని పబ్లిసిటీ కోసం ఈ పాటను విడుదల చేయలేదు. అసలు నాకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. గత 30 ఏళ్లుగా నేను ఈ చిత్ర పరిశ్రమలో వున్నాను. తమిళ ప్రజలకు శింబు అంటే ఎవరో అందరికి తెలుసు. అలాంటి ఇప్పుడు ఏదో పబ్లిసిటీ కోసం ఇలా పాటలను రూపొందించాను అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కానీ ఈ పాటను నేను అధికారికంగా విడుదల చేయలేదు. ఎవరో పనిగట్టుకుని నాకు ఇలాంటి సమస్యలు పుట్టించాలనే ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేసారు. గతంలో ‘మన్మధన్’ సినిమా సమయంలో కూడా అమ్మాయిలకు వ్యతిరేకంగా శింబు నటించాడంటూ ఆందోళన చేసారు. కానీ ఆ సినిమా అమ్మాయిల వల్లనే పెద్ద విజయం సాధించింది. పైగా ఆ సినిమాలో అమ్మాయిలకు వ్యతిరేకంగా నేనేం నటించలేదు. నాకు లేడి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అలాంటిది వారిని కించపరుస్తూ ఎందుకు పాటను రూపొందిస్తాను అని అన్నారు.
ఈ విషయంపై తాను చట్టపరంగా కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా వున్నానని, కానీ నా అభిమానులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తారన్న నమ్మకం వుందని శింబు అన్నారు. మరి పోలీసుల ముందు శింబు హాజరవుతాడో లేదో అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది. అసలు ఈ సమస్య ఎంతకి దారితీస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more