Parthiban and seetha join for Oru Melliya Kodu

Parthiban and seetha join for oru melliya kodu

Parthiban and Seetha together again, Parthiban and Seetha latest movie, Parthiban and Seetha stills, Parthiban and Seetha latest news, Oru Melliya Kodu movie news, Oru Melliya Kodu stills, Oru Melliya Kodu movie updates, Oru Melliya Kodu cast

Parthiban and seetha join for Oru Melliya Kodu: stars Arjun, Shaam, Manisha Koirala and Aqsa Bhatt in lead roles. Director A.M. R. Ramesh's new Tamil/Kannada bilingual 'Oru Melliya Kodu' .

25 ఏళ్ల తర్వాత మాజీ మొగుడితో సీత జోడి

Posted: 12/21/2015 02:54 PM IST
Parthiban and seetha join for oru melliya kodu

తెలుగు, తమిళ భాష సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సంపాదించుకున్న నటి సీత. అలాంటి సీత తన మాజీ భర్తతో కలిసి నటించడానికి సిద్ధమవుతోంది. ఆ మాజీ భర్త మరెవరో కాదు... తెలుగు, తమిళం భాషలలో విభిన్న పాత్రలతో, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు పార్తిబన్.

పార్తిబన్-సీత కలిసి ‘పుదియపాదై’ చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి విభేదాలు వచ్చి, విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు.

అయితే విడిపోయిన ఈ జంటను వెండితెర మీద మళ్లీ కలపబోతున్నాడు దర్శకుడు ఎఎంఆర్ రమేష్. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఒరు మెల్లియకొడు’. అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో సీత-పార్తిబన్ లు కీలక పాత్రలలో నటించనున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించనుండటం తమిళంలో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parthiban  Seetha  Oru Melliya Kodu  stills  gossips  

Other Articles