Allu Arjun met old women suffering with cancer

Allu arjun met old women suffering with cancer

Allu arjun meets old lady fan, Allu arjun meets his fan in vijayawada, Allu arjun meets masthan b, Allu arjun latest news, Allu arjun latest updates, Allu arjun details, Allu arjun stills, Allu arjun movies, Allu arjun movie updates, Allu arjun

Allu Arjun met old women suffering with cancer

అభిమాని ఇంటికి వెళ్లి ఆనందం పంచిన బన్నీ

Posted: 12/15/2015 12:56 PM IST
Allu arjun met old women suffering with cancer

సినిమాలు ఆడాలంటే.. అభిమానులు కావాలి. అభిమానులు ఆదరిస్తేనే నటులు స్టార్ లు అవుతారు. మాములు హీరోలు సైతం స్టార్ హీరోలుగా మార్చేసే దమ్ము కేవలం అభిమానులకు మాత్రమే వుంది. అలాంటి అభిమానులు కష్టాల్లో వుంటే స్టార్ హీరోలు సాయం చేయకుండా వుంటారా చెప్పండి? ప్రస్తుతం అలాంటి పనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసాడు. ఏకంగా కలియుగ శబరిని కలిశాడు. త్రేతాయుగంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను స్వయంగా ఆ శ్రీరాములవారే తిన్నారట. అది గుర్తించిన బన్నీ.. కలియుగ శబరి ఇచ్చిన పాయసాన్ని కడుపారా అస్వాధించారు.

ఇటీవలే పక్క రాష్ట్రం తమిళనాడులోని చెన్నైలో భారీ వర్షాల వల్ల వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తనవంతుగా విరాళాన్ని ప్రకటించడంతో పాటు ఇంకా సహాయ కార్యక్రమాలలో తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ క్యాన్సర్ బాధితుడి చివరి కోరికను తీర్చి, అతని గుండెల్లో నిజమైన హీరో అయ్యాడు.

విజయవాడలోని సింగ్ నగర్ లో 65 ఏళ్ల మస్తాన్ బీ అనే మహిళ నివసిస్తోంది. గతంలో అల్లు రామలింగయ్యకు ఆమె వీరాభిమాని. ఆ తర్వాత అల్లు అర్జున్ కు ఫ్యాన్ అయ్యింది. అల్లు అర్జున్ డాన్సులు, యాక్టింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అలాంటి ఆవిడ గతకొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతూ రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

Video source: TV9TeluguLive

క్యాన్సర్ వ్యాధి ముదరడంతో ఇంకో ఆరు నెలలు బ్రతకడం కూడా కష్టమని తెలిసింది. దీంతో తన చివరి కోరికగా అల్లు అర్జున్ ను ఒక్కసారైనా చూడాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన షూటింగ్ తో బిజీగా వున్నప్పటికీ, కాస్త సమయం తీసుకొని, విజయవాడలోని ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. అల్లు అర్జున్ కు తన చేతులతో పాయసం తినిపించింది. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించాక ఆమెకు అల్లు అర్జున్ పండ్లను అందజేసాడు.

ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ... అల్లు అర్జున్ ను చూసిన తర్వాత తనకు క్యాన్సర్ వుందనే విషయాన్ని కూడా మర్చిపోయానని, అల్లు అర్జున్ తనకు మనవడిలాంటి వాడని ఆనందం వ్యక్తం చేసింది. ఓ పేదరాలి కోసం అల్లు అర్జున్ ఇంత దూరం రావడం ఆయన గొప్పతనం అని తెలిపింది. అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో చల్లగా వుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Meets  Old Lady fan  Vijayawada  sarainodu  stills  

Other Articles