Gopichand Soukyam Movie Audio Released

Gopichand soukyam movie audio released

Gopichand Soukyam Audio Launch, Soukyam Trailer, Soukyam Movie Audio songs, Gopichand movie news, Gopichand movie updates, Gopichand latest news, Gopichand stills, Gopichand Regina films, Gopichand movie updates, Gopichand stills, Gopichand, Regina latest stills, Regina hot stills, Regina

Gopichand Soukyam Movie Audio Released: Actor Gopichand latest film Soukyam. Regina heroine. AS Ravikumar Choudary director. V Anand prasad producer. Anoop music.

‘సౌఖ్యం’ ఆడియోతో గోపిచంద్ కోరిక తీరింది

Posted: 12/14/2015 11:28 AM IST
Gopichand soukyam movie audio released

గోపిచంద్, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌఖ్యం’. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం ఒంగోలులో, ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బిగ్ సీడి, ఆడియో సిడీలను హీరో గోపిచంద్ విడుదల చేసారు.

ఇదే వేడుకపై హీరోయిన్ రెజీనా పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలతో పాటు గోపిచంద్, రెజీనా, అనూప్, ఆర్.నారాయణ మూర్తి, శంకర్ మాస్టర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా కూడా సినిమా మంచి ఘన విజయం సాధించాలని కోరారు. ఒంగోలులో ఆడియో వేడుక చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. సౌఖ్యం సినిమాతో ఆ కోరిక నెరవేరింది. ఇందుకు ఆనంద్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని గోపిచంద్ చెప్పుకొచ్చారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Soukyam  Trailer  Audio launch  Regina  stills  

Other Articles