Jatha Kalise Movie Audio Launch

Jatha kalise movie audio launch

Jatha Kalise Audio Launch, Jatha Kalise Audio Released, Jatha Kalise Audio songs, Jatha Kalise trailers, Jatha Kalise stills, Jatha Kalise posters, Jatha Kalise

Jatha Kalise Movie Audio Launch: Ashwin, Tejaswi latest film Jatha Kalise. SS Rajamouli launched this film audio.

అన్నయ్య లేకపోతే నేను లేను: అశ్విన్

Posted: 12/14/2015 10:46 AM IST
Jatha kalise movie audio launch

అశ్విన్, తేజస్విని జంటగా నటించిన తాజా చిత్రం ‘జతకలిసే’. ఓక్ ఎంటర్ టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడిని, ఆడియో సీడీలను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించి, తొలి సిడీని కీరవాణికి అందజేసారు. థియేటర్ ట్రైలర్ ను కీరవాణి విడుదల చేసారు. ఇదే వేదికపై ‘రాజుగారి గది’ 50రోజుల వేడుక కూడా జరిగింది.

‘రాజుగారిగది’ 50 రోజుల వేడుక కార్యక్రమంలో నారా రోహిత్, తారకరత్నలు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ మాట్లాడుతూ... మా అన్నయ్య(ఓంకార్) లేకపోతే నేను లేను. ఇది నాకు మూడో సినిమా. రాజుగారి గది చిత్రంతో నాకు మంచి లైఫ్ వచ్చింది. విక్కీ, సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. మా దర్శకనిర్మాతలకే కాదు సోలో హీరోగా కూడా నాకు ఇదే తొలి సినిమా. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా కూడా ‘జతకలిసే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు తేజస్విని, స్నిగ్ధ, విద్యుల్లేఖ రామన్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jatha Kalise  Audio Launch  Tejaswi  Trailers  Stills  

Other Articles