Killing Veerappan | Release Date | RGV

Rgv killing veerappan movie release date

Killing Veerappan Movie Release Date, Killing Veerappan Trailer, Killing Veerappan movie news, Killing Veerappan movie updates, Killing Veerappan stills, Killing Veerappan news, Killing Veerappan posters, Killing Veerappan

RGV Killing Veerappan Movie Release Date: Killing Veerappan is an upcoming film directed by Ram Gopal Varma with Shivaraj Kumar, Sandeep Bharadwaj and Parul Yadav in lead roles. Produced by BV Manjunath, music composed by Sai Kartheek, Ravi Shanker. Background Music and Sound Design by Seshu KMR.

వర్మ Killing వీరప్పన్ కు లైన్ క్లియర్

Posted: 12/04/2015 10:44 AM IST
Rgv killing veerappan movie release date

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. జి.ఆర్. పిక్చర్స్ సమర్పణలో బి.వి. మంజునాథ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కన్నడ స్టార్ హీర్ శివరాజ్ కుమార్, నటుడు సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫోటోలు, పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. అయితే తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు. శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సందీప్ భరద్వాజ్ ‘వీరప్పన్’ పాత్రలో నటించారు.

ఈ సినిమాను వర్మ కేవలం హిందీలో మాత్రమే చేస్తానని మాటిచ్చి, ఇపుడు అన్ని భాషలలో తీశారని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ సినిమా అన్ని భాషలలో విడుదలైతే తమ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఈ విషయంపై స్వయంగా ముత్తులక్ష్మీతో వర్మ చర్చలు జరిపి, చివరకు ‘వీరప్పన్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నాడు.

ముత్తులక్ష్మీతో స్నేహపూర్వకంగా చర్చించమని, ఇక సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని, డిసెంబర్ 11న సినిమా విడుదల చేయబోతున్నామని వర్మ ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Killing Veerappan  Release Date  RGV  Trailers  Posters  

Other Articles