సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. అంతేకాకుండా ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకుల థియేటర్లకే వచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఓ బంగారం ప్లాన్ వేసారు.
అదేంటంటే.. ‘‘సైజ్ జీరో’ సినిమా చూడండి... 1 కిలో బంగారం గెలవండి’ అనే కాంటెస్ట్ ను ఏర్పాటుచేసారు. ‘సైజ్ జీరో’ సినిమా ప్రదర్శించబడే థియేటర్లలో టికెట్ తో పాటు ఓ కూపన్ ను కూడా ఇవ్వనున్నారు. ఈ కూపన్ కోడ్ ను 95454 66666కి SMS గానీ లేదా www.pvpcinema.com అనే వెబ్ సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ బంగారం ఇచ్చే కాంటెస్ట్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాల పాటు ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో ఇరవై మందిన ఎంపిక చేసి, అందులో ఒకరికి మాత్రమే కిలో బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ప్రకటించారు. పైరసీని ఎలాగో ఆపలేకపోతున్నాం కాబట్టి.. కనీసం ఇలాగైనా ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే చిరుప్రయత్నమని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు.
అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్, పోసాని కృష్ణమురళి, భరత్, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్: కిరణ్ కుమార్, సాహిత్యం: అనంత్ శ్రీరామ్, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డ్యాన్స్: రాజుసుందరం, బృంద, ఫిరోజ్‌ఖాన్, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more