Manchu Mohan Babu | Emotional | 40 years celebrations

Manchu mohan babu gets emotional at his 40 years celebration

Manchu Mohan Babu gets Emotional, Mohan Babu Emotional at his 40 years event, Manchu Mohan Babu 40 years celebration event, Manchu Mohan Babu cries, Manchu Mohan Babu 40 years, Manchu Mohan Babu 40 years Event, Manchu Mohan Babu, stills

Mohan Babu gets Emotional at his 40 years celebration: Manchu Mohan Babu gets Emotional at his 40 years celebration event. Manchu Mohan Babu completes 40 years in film industry.

కంటతడి పెట్టిన కలెక్షన్ కింగ్

Posted: 11/23/2015 04:27 PM IST
Manchu mohan babu gets emotional at his 40 years celebration

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. డైలాగ్స్ చెప్పడంలో ఆయన తర్వాతే మరెవరైనా కూడా. డైలాగ్ లో స్పష్టత, మాటలో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావాభావాలు ఇలా యాక్టింగ్ లో అదరగొట్టి, కలెక్షన్ కింగ్ గా పేరుగాంచిన ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు.

మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సంధర్భంగా తాజాగా ‘MB 40’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు సినీ ప్రముఖులకు మోహన్ బాబు సన్మానం చేసారు.

Video Courtesy : TFPC

ఇక ఈ సంధర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టారు. మోహన్ బాబు మాట్లాడుతూ... తాను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ అద్దింట్లో వుండేవాడినని, తినడానికి కూడా సరైన తిండి లేకుండా వుండేవాడినని చెప్పారు. అలాగే తాను వుంటున్న ఇళ్లు కూడా సరిగ్గా వుండేది కాదని, ఇంట్లో వాడుకునే పాత్రలు కూడా చాలా తక్కువేనని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటికి ఇవ్వవలసిన అద్దె మూడు నెలల నుంచి కట్టలేదని, ఆ ఇంటి ఓనర్ తన వంటపాత్రలో టాయిలెట్ చేసారట. ఎందుకంటే ఇలా చేస్తేనైనా ఇళ్లు ఖాళీ చేస్తాడని అలా చేసారని చెప్పుకొచ్చారు. కానీ తాను ఆరోజు పస్తులుండి, మరుసటి ఆ పాత్రను క్లీన్ చేసుకొని, అదే పాత్రలో వంట చేసుకొని తిన్నానని చెప్పుకొచ్చాడు.

కానీ అలాంటి మోహన్ బాబు ఇపుడు కలెక్షన్ కింగ్ గా ఎదిగి, ఈ స్థాయికి చేరుకొని ప్రస్తుతం విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, కులమతాలకు అతీతంగా విధ్యాసంస్థలను ఏర్పాటు చేసి, ఇపుడు 12వేలకు పైగా మంది విధ్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా నటుడిగా కొనసాగుతూ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు మోహన్ బాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Mohan Babu  Emotional  40 years celebrations  

Other Articles