Akkineni Nagarjuna fans attempt suicide for Akhil Movie Tickets

Akkineni nagarjuna fans attempt suicide for akhil movie tickets

Akkineni fans attempt suicide for Akhil Movie Tickets, Akkineni fans attempt suicide for Tickets, Akkineni fans angry on Akhil Movie Tickets, Akhil tickets booking, Akhil collections, Akhil stills, Akhil

Akkineni Nagarjuna fans attempt suicide for Akhil Movie Tickets: Akkineni Akhil latest film akhil ready to release on 11 november. Akkineni fans angry on akhil film tickets price hikes.

అక్కినేని ఫ్యాన్స్ ఇద్దరు ఆత్మహత్యయత్నం

Posted: 11/10/2015 04:09 PM IST
Akkineni nagarjuna fans attempt suicide for akhil movie tickets

సినిమా విడుదలకు సినిమా విడుదల కావట్లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే... సినిమా విడుదలయ్యే సమయంలో టికెట్ల రేట్లు పెంచేసారు, టికెట్లు దొరకడం లేదంటూ ప్రతిసారి వార్తలొస్తూనే వుంటాయి. అలాంటి జాబితాలోకి ‘అఖిల్’ సినిమా చేరింది. ఇటీవలే ‘అఖిల్’ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కానీ ఇపుడు విడుదలకు సిద్ధమవుతున్న ‘అఖిల్’ సినిమాపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే... అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి.

కానీ ఈ సినిమా టికెట్స్ రేట్లు భారీగా పెంచేసారట. దీంతో కొంతమంది అభిమానులు చావడానికి సిద్ధమయ్యారు. నగరంలోని ఆనం థియేటర్ వద్ద అక్కినేని అభిమానులు ఆందోళనకు దిగారు. ‘అఖిల్’ సినిమా టికెట్లను అధిక రేటుకు అమ్మేస్తున్నారని, ఆ థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇద్దరు అభిమానులు తమ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు.

అయితే అక్కడే వున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తరలించారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. వి.వి.వినాయక్ దర్శకత్వలో అఖిల్, సయేశా సైగల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నితిన్ నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles