Akkineni | Akhil | Release Date

Akhil tamil theatrical trailer

Akhil Movie Tamil Theatrical Trailer, Akhil Movie Release confirmed on 11 November, Akhil Movie Release Date Postponed, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Tamil Theatrical Trailer: Akhil Akkineni latest film Akhil. VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors. This film will be release on 11 November.

వారెవ్వా... అఖిల్ ట్రైలరంటే.. సిరిగిపోయిందిపో!

Posted: 11/04/2015 07:03 PM IST
Akhil tamil theatrical trailer

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమా ఈనెల 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అంతగా సినిమాపై అసక్తి పెంచలేకపోయింది. దీంతో సినిమాలో అంతగా ఏం ఆకట్టుకునే అంశాలు లేవని సినీ అభిమానులు నిరాశ చెందారు. కానీ అఖిల్ తమిళ ట్రైలర్ ఆ అపోహాలను మార్చేసింది.

‘అఖిల్’ సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తమిళ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూస్తుంటే ‘అఖిల్’ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి. అఖిల్ లుక్స్ పరంగా చాలా చక్కగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా స్టోరీలో ఏదో మంచి మ్యాటర్ వున్నట్లుగానే అనిపిస్తోంది.

భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళంలో సికె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా సంగీతం అందించారు.

అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటించింది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘అఖిల్’ సినిమా ఈ దీపావళికి భారీగా సందడి చేయనుంది. మరి ‘అఖిల్’ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Release Date  Sayesha saigal  movie news  

Other Articles