Anushka | Size Zero | Audio launch | Release date

Anushka size zero movie audio launch

Anushka Size Zero Audio Released, Anushka Size Zero Release date, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Size Zero Movie Audio Launch: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Anushka Size Zero movie Release on 27 November.

విడుదలైన అనుష్క ‘సైజ్ జీరో’ పాటలు

Posted: 11/02/2015 11:39 AM IST
Anushka size zero movie audio launch

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ఆర్య, సోనల్ చౌహన్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను తాజాగా హైదరాబాద్ లో విడుదల చేసారు. ఎస్.ఎస్.రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. బిగ్ సీడీ మరియు ఆడియో సీడీలను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. తొలి సీడీని రానా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అనుష్క, ఆర్య, సోనల్ చౌహన్, రాజమౌళి, వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని, ఆలీ, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని 1500 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Audio launch  Release date  Movie News  Arya  

Other Articles