సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ‘పసంగ-2’ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో విడుదల చేస్తుండడం తెలిసిందే. సాయిమణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నారు. సూర్య`కె.ఇ.జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. అమలాపాల్, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్రోల్ కొర్రెల్ సంగీతం అందిస్తున్నారు.
తమిళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో అద్బుతమైన ఆదరణ పొందుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అర్రోల్ కోర్రెల్ పేరు తమిళ నాట మారుమోగుతోంది. తెలుగులో వెన్నెలకంటి-చంద్రబోస్-సాహితి సాహిత్యం సమకూర్చుతున్న ఈ చిత్రంలోని పాటలు ఈవారంలో విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శత్వంలో.. సూపర్‌స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ‘పసంగ`2’ చిత్రాన్ని ‘మేము’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగానూ.. గర్వంగానూ ఉంది. సన్నితి ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ అధినేతలు ప్రసాద్ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి మాతో కలిసి తెలుగులో ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు.
హిందీలో అమీర్‌ఖాన్ నటించి, నిర్మించి.. దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ తరహా గొప్ప చిత్రం ‘మేము’. "మనం, దృశ్యం" చిత్రాల్ కోవలో అందర్నీ అమితంగా అలరించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడిగా పాండిరాజ్ ఎంతటి ప్రతిభావంతుడో మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ఆడియో విడుదల చేసి, ఈనెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్ కె.యల్, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్-సాహితి-సంగీతం: అర్రోల్ కొర్రెల్, సమర్పణ: సూపర్‌స్టార్ సూర్య-కె.ఇ.జ్ఞానవేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్!!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more