తెలుగులో ‘సొంతం’, ‘జెమిని’ సినిమాలతో కుర్రకారుకు దగ్గరయిన నమిత.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి బొద్దుగా మారి హాట్ బ్యూటీగా మారిపోయింది. నమిత బొద్దుగా మారడంతో తమిళంలో భారీ క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తన బరువు భారీగా పెరిగిపోయిందని గ్రహించడంతో ఇటీవలే ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకొని స్లిమ్ గా మారిపోయింది.
నమిత బొద్దుగా వున్నపుడే తమిళం రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని, కాకపోతే ఇప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని గతంలో స్పష్టం చేసింది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను. నాకు ఇంత గుర్తింపును ఇచ్చింది తమిళ ప్రేక్షకులే. అందుకే వారికి తనవంతు సేవను చేయడానికి రాజకీయాల్లోకి వస్తాను. పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానం అందింది. అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పను. ఇపుడు స్లిమ్ గా మారి మీకందరికి ఎలా షాకిచ్చానో.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గెలిచి అందరికి షాకివ్వబోతున్నాను అని గతంలో చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా ఇదే విషయంపై నమిత మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. గతకొద్ది రోజులుగా నమిత రాజకీయాల్లోకి రాబోతుందట అంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల ఎంట్రీ గురించి నమిత మాట్లాడుతూ... ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? ఇండియాలో ఇప్పుడున్న రెండు పెద్ద పొలిటికల్ పార్టీల వాళ్లు తమ పార్టీలలో చేరమంటూ రాయబారం పంపుతున్నారని తెలిపింది. అయితే ఈ విషయంలో తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాకపోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని, ఆ విషయాలన్నీ కూడా త్వరలోనే తెలియజేస్తానని నమిత స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more