I always respect annaya, Pawan Kalyan

Sardar pawan kalyan meets chiranjeevi

pawan kalyan meets chiranjeevi, sardar meets chiru, Chiranjeevi, pawan kalyan congratulated chiranjeevi, chiru grand re entry into movies, Pawan Kalyan, PK Meets Chiru, Chiranjeevi Residence, Ram Charan, Bruce Lee, pawan kalyan, chiranjeevi, bruce lee, Ramcharan, Mega fans

Powerstar Pawan Kalyan today paid a visit to his elder bother Megastar Chiranjeevi’s residence and congratulated him on his grand re-entry.

మెగాస్టార్ చిరును అభినందించిన సర్థార్..

Posted: 10/18/2015 05:57 PM IST
Sardar pawan kalyan meets chiranjeevi

నిన్నమెన్నటి వరకు తెలుగు వెండితెరపై రారాజులా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత రాజకీయ ఆరంగ్రేటం చేయడం.. బిజీబిజీగా మారడం.. మళ్లీ ఇన్నాళ్లు బ్రూస్ లీ చిత్రంలో నటించడం.. టాలీవుడ్ సర్థార్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంతోషం కలిగించాయి. అందుకే ఆయన ఆదివారం సాయంత్రం అన్నయ్య చిరంజీవి ఇంటికీ వెళ్లి బొకే ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా వున్న పవన్ కల్యాణ్.. అదే కాస్టూమ్ లో రామానాయుడు స్టూడియోస్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. పవన్ కల్యాన్ కు ఎదురెళ్లిన మరీ స్వాగతం పలికి.. ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు మోగా పవర్ స్టార్ రామ్ చరణ్.

చాలా కాలం తర్వాత 'బ్రూస్ లీ' లో నటించిన అన్నయ్య చిరంజీవిని పవన్ అభినందించారు. చిరుతో పాటు రామ్ చరణ్లను పవన్ అభినందించారు. పవన్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత చిరంజీవితో అంతరం ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయ్యను కలిసిన పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలవడం ఇది రెండోసారి. తనయుడు రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరివడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమాల్లోకి రావడానికి అన్నయ్యే కారణమని ఆయనను మళ్లీ ఇన్నాళ్లు తెరపై చూడటం సంతోషకరమని చెప్పారు.

తనకు అన్నయ్యకు మద్య రాజకీయ విధానాలతో భిన్నాభిప్రాయం ఉందన్న పవన్ కళ్యాణ్.. రాజకీయ విధానాలు వేరు అయినా సినిమా, కుటుంబపరంగా తనకు అన్నయ్య అంటే గౌరవం అని ఆయన చెప్పారు. చిరంజీవిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తను నటిస్తున్న సర్థార్ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నామని, అయితే అప్పటి లోగా పూర్తవుతుందా లేదా అన్నది చేడాలని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా తాను నిర్మించదలచిన సినిమా విషయమై రెండు మూడు కథలు విన్నామని, అయితే అంతకన్న మంచి మెరుగైన కథకోసం వేచిచూస్తున్నామని పవన్ చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chiranjeevi  bruce lee  Ramcharan  Mega fans  

Other Articles