Nadigar Sangam Election: Vishal allegedly attacked inside police booth

Hero vshal attacked in polling booth at nadigar sangam election

Vishal allegedly attacked inside police booth, Vishal, Nadigar Sangam Election, Vishal sarath kumar group, mylapore, St. Ebbas School, actress sangeetha manhandled, hero vishal went to rescue sangeetha,

Prominent hero and contestant for the Nadigar Sangam elections Vishal was attacked on Sunday. It is believed that supporters of the incumbent Sarathkumar attacked him

ITEMVIDEOS: హీరో విశాల్ పై శరత్ కుమార్ వర్గీయుల దాడి

Posted: 10/18/2015 12:19 PM IST
Hero vshal attacked in polling booth at nadigar sangam election

నడిగర్ సంఘం ఎన్నికలు తమిళ చిత్రసీమలో ఇరువర్గాల మధ్య అగ్గిని రాజేశాయి. ఇన్నాళ్లు అరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలకు మాత్రమే పరిమితమైన ఇరువర్గాలు.. ఏకంగా ఎన్నికలరోజున దాడులకు కూడా దిగడంతో కాలీవుడ్ అభిమానుల్లో అందోళన చెలరేగింది. నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో మైలాపూర్ లో జరుగుతున్న ఎన్నికల బూత్ లో హీరో విశాల్పై ప్రముఖ నటుడు శరత్కుమార్ వర్గీయులు ఆదివారం దాడి చేశారు. విశాల్ వర్గానికి చెందిన నటి సంగీతను శరత్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అమెను సురక్షింతంగా బయటకు తీసుకువద్దామనుకుని పోలింగ్ బూత్ లోకి వెళ్లిన హీరో విశాల్ పై శరత్ కుమార్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే సన్నిహితులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలు ఆదివారం ఆళ్వార్పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్  బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైంది. అంతేకాకుండా అటు శరత్కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Nadigar Sangam Election  Vishal sarath kumar group  mylapore  

Other Articles