Allu Arjun Sensational comments on Rudhramadevi

Allu arjun sensational comments on rudhramadevi

Allu Arjun Sensational comments on Rudhramadevi, Allu Arjun about Ram Charan Bruce lee, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun tweets, Allu Arjun comments on Brucelee, Allu Arjun, Brucelee the fighter, Brucelee the fighter movie news, Brucelee the fighter stills

Allu Arjun Sensational comments on Rudhramadevi: stylish star allu arjun latest film Rudhramadevi. Allu Arjun talks about Ram Charan latest film Brucelee the fighter. This film will be release on 16 oct.

రుద్రమదేవిపై గోనగన్నారెడ్డి భారీ కామెంట్లు.. బ్రూస్ లీ తప్పేంలేదంటున్న బన్నీ!

Posted: 10/13/2015 10:26 AM IST
Allu arjun sensational comments on rudhramadevi

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రం ఈనెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత అక్టోబర్ 16వ తేదిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే రుద్రమదేవి వంటి చారిత్రాత్మక, భారీ బడ్జెట్ వంటి చిత్రం కోసం ‘బ్రూస్ లీ’ చిత్రాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. పైగా ‘బ్రూస్ లీ’ చిత్ర నిర్మాతలదే తప్పు అన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ‘బ్రూస్ లీ’ చిత్ర విడుదల ఖచ్చితంగా అక్టోబర్ 16వ తేదినే వుంటుందని రాంచరణ్ స్పష్టం చేసారు.

అయితే ఇదే విషయంపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. ‘బ్రూస్‌ లీ’ చిత్రం ఈ నెల 16 న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ముందుగానే ప్ర‌కంటించారు. ‘రుద్ర‌మ‌దేవి’ విడుద‌ల తేదిని నిర్మాత‌లు కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు.. షెడ్యూల్ ప్ర‌కారం ‘రుద్ర‌మ‌దేవి’ సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కావాల్సింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల‌న అక్టోబ‌ర్ 9న విడుద‌ల‌య్యింది. కాని షెడ్యూల్ ప్ర‌కారమే బ్రూస్‌లీ అక్టోబ‌ర్ 16న విడుద‌ల కానుంది. ఆ విష‌యం తెలిసే నిర్మాత‌లు ‘రుద్ర‌మ‌దేవి’ చిత్రాన్ని అక్టోబ‌ర్ 9న విడుద‌ల చేశారు. దీనికి బ్రూస్‌లీ నిర్మాత‌ల్ని బ్లేమ్ చెయ్య‌న‌క్క‌ర్లేదు. వారు ముందుగా ప్ర‌కంటించిన షెడ్యూల్ ప్ర‌కారమే విడుద‌ల చేస్తున్నారు. కాబ‌ట్టి ఈ రెండు చిత్రాలు కూడా స‌మానంగా ప్ర‌జాదర‌ణ పోందుతాయ‌ని ఆశిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

‘రుద్రమదేవి’ చిత్రం ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది. ఇక రాంచరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి U/A సెన్సార్ సర్టిఫికెట్ దక్కింది. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ పాటలు ఇప్పటికే దుమ్మురేపుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  tweets  Rudhramadevi  Brucelee the fighter  Ram charan  Tweets  Release date  

Other Articles